ETV Bharat / state

రోగ నిరోధక శక్తికి ఔషధం.. 'ఆయుష్‌ క్వాత్‌' - new products of Genome Labs

రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి హైదరాబాద్‌కు చెందిన జినోమ్‌ ల్యాబ్స్‌ సరికొత్త 'ఆయుష్‌ క్వాత్‌' పౌడర్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఉత్పాదనను గురువారం హైదరాబాద్​లోని సంస్థ కార్యాలయంలో ఆవిష్కరించారు. నిత్యవసర సేవల విభాగంలో పని చేస్తోన్న లక్ష మందికి దీనిని ఉచితంగా పంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది జినోమ్​ ల్యాబ్స్​.

Immunity Booster Launches by Genome Labs in Hyderabad
రోగ నిరోధక శక్తికి ఔషధం... 'ఆయుష్‌ క్వాత్‌'
author img

By

Published : Jun 4, 2020, 7:53 PM IST

రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి హైదరాబాద్‌కు చెందిన జినోమ్‌ ల్యాబ్స్‌ సరికొత్త 'ఆయుష్‌ క్వాత్‌' పౌడర్​ను అందుబాటులోకి తెచ్చింది. కొవిడ్‌-19 వైరస్​ దాడితో మానవుల్లోని రోగనిరోధక శక్తి మందగిస్తున్న తరుణంలో ఈ ఉత్పాదన చాలా ఉపయోగపడనుంది. ఈ ఉత్పాదనను హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఆవిష్కరించారు. కరోనా వైరస్‌కు ఔషధం అందుబాటులోకి వచ్చేందుకు చాలా సమయం పడుతుందన్న కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా... రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి దీనిని రూపొందించినట్లు జినోమ్‌ ల్యాబ్స్‌ డైరెక్టర్‌ నాగరాజు తెలిపారు. ఈ పొడిని డికాక్షన్​లో మాదిరిగా వేసుకొని... తాగాలని వివరించారు.

కేరళ, కర్ణాటకల నుంచి తెప్పించిన తులసి, దాల్చిన చెక్క, శొంఠి, నల్లని మిరియాలతో ఈ పౌడర్‌ను రూపొందించామన్నారు. రోగనిరోధక శక్తి పెరిగితే... కరోనా వైరస్‌ ప్రభావం తగ్గుతుందని జినోమ్​ ల్యాబ్స్​ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌ అన్నారు. ప్రస్తుతం కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల్లో నిత్యవసర సేవలందిస్తున్న వివిధ రంగాల్లోని లక్ష మందికి దీనిని ఉచితంగా పంపిణీ చేయనున్నామని వారు తెలిపారు. ఇతరులకు ఎవరికైనా అవసరం ఉంటే బంజారాహిల్స్‌లోని కార్యాలయానికి వస్తే ఉచితంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్‌ నాగరాజు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : మీరు కాఫీ తాగుతున్నారా...? అయితే ఇవి తెలుసుకోండి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.