IAS Officer Sridevi Reaction On Her Transfer : కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) పర్యటనకు 3 రోజుల ముందే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకుంటే.. ఆ శాఖ పని తీరుకు తాను బాధ్యురాలిని అవుతానా అంటూ ఐఏఎస్ అధికారిణి టీకే శ్రీదేవి ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రశ్నించారు. తను రాక ముందు ఆ శాఖ పని తీరు బాగోలేకపోతే తనను.. ట్రాన్స్ఫర్ చేయడం ఏంటని అసహనానికి గురయ్యారు.
రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న 20 మంది అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వారిలో నలుగురు కలెక్టర్లు, హైదరాబాద్ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, ఆబ్కారీశాఖ డైరెక్టర్, రవాణా శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఉన్నారు. వీరందరికి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని సీఎస్‌కు స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణలో పనితీరు సంతృప్తికరంగా లేకపోవటంతోనే ఆయా అధికారులను విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి నాలుగు లేఖలు రాసింది.
-
How can an officer who has taken charge 3 working days before the visit of the CEC to the state held responsible for the performance of the department? Just asking??
— TK Sreedevi (@tksreedevi) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">How can an officer who has taken charge 3 working days before the visit of the CEC to the state held responsible for the performance of the department? Just asking??
— TK Sreedevi (@tksreedevi) October 12, 2023How can an officer who has taken charge 3 working days before the visit of the CEC to the state held responsible for the performance of the department? Just asking??
— TK Sreedevi (@tksreedevi) October 12, 2023
"కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు 3 రోజుల ముందే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా బాధ్యత తీసుకుంటే.. ఆ శాఖ పనితీరుకు నేను బాధ్యురాలినా?. నేను రాక ముందు ఆ శాఖ పనితీరు బాగోలేకపోతే నన్నెలా బదిలీ చేస్తారు." - టీ.కే. శ్రీదేవి, ఐఏఎస్ అధికారిణి
బదిలీ అయిన అధికారుల వివరాలు.. రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డిగా ఉన్నారు. అలాగే హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణను బదిలీ చేశారు. సూర్యాపేట ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి రాజేంద్ర ప్రసాద్‌తో పాటు.. తొమ్మిది మంది నాన్‌కేడర్ ఎస్పీలకు స్థానచలనం కలిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు వారికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
Central Election Commission Transfer 20 Officers in Telangana : అలాగే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎక్సైజ్ శాఖ సంచాలకులు ముషారఫ్ అలీని బదిలీ చేశారు. రాష్ట్రంలోని కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని వారిని వెంటనే మార్చాలని విపక్షాలు.. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ 20 మందిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు పేజీల లేఖను రాసింది. ఇప్పటికే హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో పోలీసుల తీరుపై కూడా ఈసీ మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.