ETV Bharat / state

'తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కారించాలి'

author img

By

Published : Jun 6, 2020, 11:12 PM IST

వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జలమండలి ఎండీ దానకిశోర్​ అధికారులను ఆదేశించారు. తరచుగా సివరెజీ ఓవర్ ఫ్లో అయ్యే ప్రాంతాలను గుర్తించి.. మ్యాన్ హోళ్లు ఉప్పొంగకుండా ముందస్తు నిర్వహణ చేపట్టాలని అన్నారు.

Hyderabad water Board latest news
Hyderabad water Board latest news

భాగ్యనగరంలో తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జలమండలి ఎండీ దానకిశోర్​ అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం నుంచి డయల్ యువర్ ఎండీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

నగరంలో 1.5 మీటర్ల లోతుగల మ్యాన్ హోళ్లకు సెఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ధ్వంసమైన, మూతలు లేని మ్యాన్ హోళ్లకు తక్షణమే మరమ్మత్తు చేపట్టాలని ఆదేశించారు. నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాన్ హోల్ మూతలు తెరవొద్దని సూచించారు. మ్యాన్ హోల్ మూత ధ్వంసమైన, తెరిచి ఉంచినా జలమండలికి 155313 నంబర్​కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.