ETV Bharat / state

సురక్షితంగా రోడ్డు దాటేలా ఆకాశ మార్గాలు..

author img

By

Published : Nov 5, 2020, 9:31 AM IST

భాగ్యనగరంలో పాదచారులు సురక్షితంగా రోడ్లను దాటేలా ఆకాశమార్గాలను హెచ్​ఎండీవో అందుబాటులోకి తీసుకురానుంది. ఉప్పల్​తో పాటు మెహిదీపట్నంలో స్టీల్​ స్కైవేస్​ను నిర్మించనున్నారు. ఉప్పల్‌లో రూ.25 కోట్లతో నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ పూర్తి కాగా... మెహిదీపట్నంలో రూ.34 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహ్వానించారు.

hyderabad to get sky walk in mehdipatnam
సురక్షితంగా రోడ్డు దాటేలా ఆకాశ మార్గాలు

మహా నగరంలో పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేలా ఆకాశమార్గాల(స్కైవేస్‌)ను హెచ్‌ఎండీఏ అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఉప్పల్‌లో రూ.25 కోట్లతో నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. 9 నెలల్లో దీనిని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇప్పుడు మెహిదీపట్నం స్టీల్‌ స్కైవే డిజైన్‌కు మంత్రి కేటీఆర్‌ ఆమోదముద్ర వేయడంతో తాజాగా రూ.34 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహ్వానించారు.

  • ఉప్పల్‌లో రామంతాపూర్‌, బోడుప్పల్‌, హబ్సిగూడ, ఎల్బీనగర్‌ వైపు వెళ్లే మార్గాలను అనుసంధానం చేస్తూ సర్కిల్‌ తరహాలో 660 శ్రీ 4 మీటర్ల పొడవువెడల్పు, 6 మీటర్ల ఎత్తులో స్కైవాక్‌ను అందుబాటులోకి తీసుకువస్తారు. తద్వారా నేరుగా ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌లోకి వెళ్లొచ్చు.
  • మెహిదీపట్నం కూడలిలో ఇరువైపులా ఉన్న బస్టాండ్లను అనుసంధానిస్తూ మధ్యలో ఉన్న పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే కింది నుంచి స్టీల్‌ స్కైవే(పొడవు సుమారు 380 మీటరు,్ల వెడల్పు 3.6 మీటర్లు, ఎత్తు 6.15 మీటర్లు) నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాణిజ్య సముదాయాన్నీ నిర్మిస్తారు. దీని కింద అయిదారు బస్సులు నిలిపేలా బస్‌బే ఉంటుంది. పైన దుకాణాలకు అద్దెకిస్తారు. 16 లిఫ్ట్‌లూ ఉంటాయి

ఎఫ్‌వోబీ అలా.. స్కైవేస్‌ ఇలా

సాధారణంగా ఒక రోడ్డుకు అటు వైపు నుంచి ఇటువైపు దాటేలా నిర్మించేవి పాదచారుల వంతెనలు(ఎఫ్‌వోబీలు). స్కైవేస్‌ను మూడు, నాలుగు రోడ్లను అనుసంధానం చేస్తూ ప్రధాన కూడళ్ల దగ్గర నిర్మిస్తారు. ఎటు వైపు నుంచి ఎటైనా వెళ్లొచ్చు. అక్కడ మెట్రో స్టేషన్‌ ఉంటే.. ఎక్కడా దిగాల్సిన అవసరం లేకుండా నేరుగా లోపలికెళ్లేలా ఏర్పాట్లు చేస్తారు. ఎస్కలేటర్‌, లిఫ్ట్‌, ఇతరత్రా సదుపాయాలుంటాయి.

ఇవీ చూడండి: జంట నగరాల్లో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.