హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో తెలంగాణ ఎన్జీవో సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ పాత్రికేయులకు నిత్యావసర సరకులను అందజేశారు. బియ్యం, పప్పు, నూనెను 50మందికి పంపిణీ చేశారు.
పాత్రికేయులు సమాజానికి నిర్మాణాత్మక సేవలందిస్తున్నారని ముజీబ్ కొనియాడారు. ఇంతటి విపత్కర సమయంలోనూ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: Vaccine: కేంద్రం నుంచి వచ్చిన టీకాలు ఎన్ని? ఇంకా ఎంత అవసరం?