పెన్షనర్లు సమస్యల సాధనకు పోరాటమే శరణ్యమని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పేర్కొన్నారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ డైరీని ఆయన .. అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ..
పెన్షనర్స్ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండడం విచారకరమని తెలిపిన చుక్కా రామయ్య .. సమస్యల సాధనకు రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.
వెంటనే స్పందించి..
రాష్ట్రంలో 70 సంవత్సరాలు నిండిన వాళ్లందరికీ రెండు శాతం అదనంగా పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఔషధాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో లేక అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఔషధాలను అందుబాటులో ఉంచాలని కోరారు.
ఇదీ చదవండి:'ఆర్టీసీ మనుగడకు డ్రైవర్లు, కండక్టర్లే ప్రధాన కారణం'