ETV Bharat / state

హైదరాబాద్‌లో వ్యాపారం చేయాలంటే.. అది తప్పనిసరి! - తెలంగాణ పోలీసు శాఖ వార్తలు

Hyderabad Police License Mandatory for Traders: హైదరాబాద్​లో ఏదైనా వ్యాపారం చేయాలంటే ఇక పోలీస్​ లైసెన్సు తప్పనిసరి అని పోలీసులు తెలిపారు. ట్రేడ్ లైసెన్సు, ఫుడ్ లైసెన్సుతో పాటు.. పోలీసు లైసెన్సు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ మేరకు వ్యాపారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని పోలీసులు సూచించారు.

Hyderabad Police
Hyderabad Police
author img

By

Published : Jan 25, 2023, 11:17 AM IST

Hyderabad Police License Mandatory for Traders: హైదరాబాద్​లో ఏదైనా వ్యాపారం చేయాలంటే గతంలో జీహెచ్‌ఎంసీ నుంచి ‘ట్రేడ్‌ లైసెన్సు’, ఫుడ్‌ లైసెన్సు, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీతో పాటు పోలీసు లైసెన్సు తీసుకోవాల్సి ఉండేది. సాంకేతిక కారణాల వల్ల 2014 తర్వాత పోలీసు లైసెన్సు రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత పోలీసు లైసెన్సు నిబంధన తెరపైకొచ్చింది. ఇప్పటికే నగరంలోని ఆయా ఠాణాల పరిధిలోని పెద్దా చిన్నా వ్యాపార సముదాయాలు, హోటళ్లు, బేకరీల నిర్వాహకులను పోలీసులు కలుస్తూ.. పోలీసు లైసెన్సు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.

ఎవరు తీసుకోవాలంటే.. : స్టార్‌ హోటల్స్‌, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌, పబ్‌లు, కాఫీ షాప్‌, టీ స్టాల్‌, కెఫే, బేకరీ రెస్టారెంట్‌, ఐస్‌ క్రీమ్‌ పార్లర్‌, స్వీట్‌ షాప్‌, జ్యూస్‌ సెంటర్‌, సినిమా థియేటర్‌ క్యాంటిన్‌, డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌, హోటళ్లు, దాబాలు, సినిమాటోగ్రఫీ, ఎక్స్‌ప్లోజివ్‌, ఫైర్‌ క్రాకర్స్‌, పెట్రోలియం ఉత్పత్తులు విక్రయించేవారు ఈ లైసెన్సు తీసుకోవాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. : ఏటా ఏప్రిల్‌ 1 నుంచి తదుపరి ఏడాది మార్చి 31 వరకు గడువుతో లైసెన్సులు జారీ చేస్తామని నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. దీనికి వ్యాపార స్థాయిని బట్టి రూ.1,000 నుంచి రూ.15,000 వరకు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారులు hyderabadpolice.gov.in వెబ్‌సైట్‌ను తెరిచి అప్పటికే ఉన్న జీహెచ్‌ఎంసీ ట్రేడ్‌ లైసెన్సు, అద్దె, ఇతర ఒప్పంద పత్రాలను జత చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వారం, పది రోజుల్లో లైసెన్సు ఆన్‌లైన్‌ ద్వారా జారీ అవుతుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ఆలోపు లైసెన్సు పొందకపోతే చట్ట పరమైన చర్యలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.

వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసి: ఈ లైసెన్సు విధానం ద్వారా నగరంలోని ఆయా ఠాణాల పరిధిలో వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ఇతర వ్యాపారాలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. వ్యాపారుల ఫోన్‌ నంబరు, ఇతర వివరాలు సేకరించి వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందజేసే విధంగా ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.