ETV Bharat / state

చలి చంపుతోంది.. పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు

Road Accident due to Fog : రోడ్డు మీద జరిగే ప్రమాదాలు సాధారణమే.. కానీ ఈ మధ్య శీతాకాలంలో పొగమంచు వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రహదారులపై దట్టంగా పొగ మంచు కమ్మేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించపోవడం వల్ల జరిగే ప్రమాదాల్లో.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. ఈ మూడు నెలలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాత్రి వేళల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు.

Road Accident due to Fog
Road Accident due to Fog
author img

By

Published : Nov 7, 2022, 6:51 AM IST

Updated : Nov 7, 2022, 8:34 AM IST

Road Accident due to Fog : శీతాకాలం వచ్చిందంటే చలితో పాటు పొగమంచు వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. పొగమంచు కారణంగా 2020,2021 లోని నగర పరిధిలో సుమారు వంద మంది మరణించారని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. నగర శివార్లు, ఔటర్‌ రింగు రోడ్డుపై సాయంత్రం దాటాక వాహనాల రద్దీ పెరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాదారులు విశ్రాంతి లేకుండా వేగంగా వెళ్తుంటారు.

ఏటా సుమారు 400 రోడ్డు ప్రమాదాలు: మరికొందరు విశ్రాంతి కోసం రోడ్డు పక్కన వాహనాలు ఆపేస్తుంటారు. పొగమంచు వల్ల ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. శీతాకాలంలో ఏటా సుమారు 400 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కార్తికమాసం, క్రిస్మస్‌, సంక్రాంతి ఇలా వరుస పండుగలు ఉన్నాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ మంది విహారయాత్రలు, ఆలయాలకు వెళ్తుంటారు.

తగు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చు : ఉదయం పూట వెళ్లి రాత్రికి తిరుగు ప్రయాణమవుతారు. కానీ ఎక్కవ మందికి చలికాలంలో డ్రైవింగ్‌పై అవగాహన లేకపోవడం.. వాతావరణంలో వచ్చే మార్పును అవగతం చేసుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. పొగ మంచు వల్ల రోడ్డు స్పష్టంగా కనిపించకపోతే సురక్షిత ప్రదేశంలో వాహనాలు నిలిపివేయాలని చెబుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణాలు వాయిదా వేయడమే మంచిదని.. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని సూచిస్తున్నారు.

"రాబోయే మూడు నెలలు చాలా ముఖ్యం. ఎందుకంటే శీతకాలంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. కార్తికమాసం, క్రిస్మస్‌, సంక్రాంతి ఇలా వరుస పండుగలు ఉన్నాయి. ఎవరైతే కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తారో రాత్రి వేళల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి." - శ్రీనివాస రావు, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ

చలి చంపుతోంది.. పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు

ఇవీ చదవండి: Munugode bypoll: మునుగోడు 'గులాబీ' వశం.. ఫలించిన కేసీఆర్‌ వ్యూహం..!

వేదాలను తెలుగులోకి అనువదించిన హైదరాబాద్​ రచయిత.. 4వేల పేజీలు.. 28 కిలోల బరువు..

Last Updated : Nov 7, 2022, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.