ETV Bharat / state

Hyderabad Police Sets up 'CAMO' For CC Camera Repairs : నిఘా నేత్రాల మరమ్మతుల కోసం.. 'క్యామో' పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన నగర పోలీసులు - టుడే హైదరాబాద్ వార్తలు

Hyderabad Police Sets up 'CAMO' For CC Camera Repairs : ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసు వ్యవస్థ ఎంత ప్రాధాన్యమైందో.. అటువంటి వ్యవస్థకు సహకరించటంలో సీసీ కెమెరాల పాత్ర అంతే అని చెప్పవచ్చు. నిఘా నేత్రం అనేది మొత్తం భద్రతా వ్యూహంలో ప్రధాన భాగం. ఎందుకంటే ఇది నేరాలను పర్యవేక్షించడానికి, నిరోధించడంలో సహాయపడుతుంది. ప్రస్తుత కాలంలో సీసీ కెమెరాలు లేని రక్షణ వలయం లేదు. అటువంటి సీసీ పరికరాల్లో టెక్నికల్ ఇష్యూ వచ్చి మరమ్మతులకు గురైతే.. వాటి మెయింటెనన్స్ పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నకు హైదరాబాద్ పోలీసులు చేసిన ఆలోచనే 'క్యామో'

CC Camera Importance Role In Police Department
Hyd Police Commissinarate Latest News
author img

By

Published : Aug 16, 2023, 10:31 AM IST

Hyderabad Police Special Dept CAMO For CC Camera Repairs నిఘా నేత్రాల మరమ్మతుల కోసం ప్రత్యేక విభాగం హైదరాబాద్ సీపీ ఆనంద్

Hyderabad Police Sets up 'CAMO' For CC Camera Repairs : నేరాలను ఛేదించడంలో సీసీ కెమెరాలు పోలీసులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. నేరస్తులను గుర్తించడంతోపాటు వాళ్లు ఎటువైపు వెళ్లారనే విషయాలను సేకరిస్తున్నారు. ఐతే.. సీసీ కెమెరాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. మరమ్మతులకు గురైన వాటిని వెంటనే తిరిగి పనిచేసేలా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌(Hyderabad Police Commissionerate)లో క్యామో (కెమెరా మెయింటెనన్స్ ఆర్గనైజేషన్) పేరిట ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు.

CC Cameras Importance Role In Police Department : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఉన్నతాధికారులు తరచూ చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీసీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నిఘా నేత్రాలపై(CC Cameras) ఆధారపడి రాష్ట్రంలో 18 వేలకు పైగా కేసులను ఛేదించారు. నేను సైతం కార్యక్రమం కింద కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. పోలీస్ స్టేషన్‌లలో ఉండే కంట్రోల్ రూమ్‌కు సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. పోలీసు అధికారులు.. నిత్యం వాటిని పర్యవేక్షిస్తూ ఉంటారు. నిఘా నేత్రాల ఏర్పాటుకు సాయం చేసిన వారికి ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

CC CAMERAS: సీసీ కెమెరాల్లో తెలంగాణదే అగ్రస్థానం

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 10లక్షలకుపైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 5లక్షలకుపైగా ఉన్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటు వరకు బాగానే ఉన్నా.. వాటిలో తలెత్తే సాంకేతిక సమస్యలే(CC Camera Technical Issues) పోలీసులకు తలనొప్పిగా మారాయి. గాలి, వర్షం, ఎండ వల్ల సీసీ కెమెరాలు మరమ్మతులకు గురవుతున్నాయి. వాటిని అలాగే వదిలేయడం వల్ల అసలైన సమయాల్లో ఉపయోగపడటం లేదు.

Special Department for Repair of Surveillance Eyes : సీసీ కెమెరాల్లో పెద్దమొత్తంలోనే పనిచేయడం లేదని గుర్తించారు. వీఐపీలు వాకింగ్ కోసం వచ్చే కేబీఆర్ పార్కులో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు సెల్‌ఫోన్ లాక్కెళ్లిన దుండగుడిని గుర్తించడానికి బంజారాహిల్స్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఐతే పరిసర ప్రాంతాల్లో నిఘానేత్రాలు పనిచేయడం లేదని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉన్నట్లు గుర్తించి సీపీ సీవీ ఆనంద్(Commissioner of Police Hyderabad City).. నిఘా నేత్రాల మరమ్మతుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు.

సంయుక్త సీపీ స్థాయి అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పజెప్పారు. సీసీ కెమెరా నిర్వహణ విభాగంలో పొరుగు సేవల విధానంలో 30మంది సిబ్బందిని నియమించారు. కాలనీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సైతం కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో మరమ్మతులు చేయించుకోవాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఏదైనా నేరం జరిగినప్పుడు సులభంగా ఛేదించే అవకాశం ఉందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

భారతదేశ వ్యవస్థకే తెలంగాణ పోలీసు ఒక కలికితురాయి: సీఎం కేసీఆర్

తెలంగాణ పోలీసులకు ఒడిశాలో 'సైకత' సలాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.