సామాజిక మాధ్యమాల వినియోగం పట్ల అవగాహన లేక సామాన్యులు సైబర్ మోసాలబారిన పడుతున్నారని.... ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సూచించారు. సైబర్ సేఫ్ హైదరాబాద్గా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతర్జాలం, సామాజిక మాధ్యమాల వినియోగంలో మహిళలు, యువతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిటీ పోలీసుల ఆధ్వర్యంలో విశ్వేశ్వరయ్య భవన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నిపుణుడు రక్షిత్ టాండన్.... సైబర్ మోసాల జరిగే తీరుపట్ల అవగాహన కల్పించారు. వ్యక్తిగత వివరాలు, ఫొటోలు భద్రంగా ఉంచుకోవాలని రక్షిత్ టాండన్ సూచించారు.
ఇదీ చూడండి: కొత్త పురపాలక చట్టం బిల్లుకు ఆమోదం తెలపని గవర్నర్