ETV Bharat / state

saroornagar kidnap case: కిడ్నాప్‌ ఉదంతం సుఖాంతం... కార్పొరేటర్ సహా 10 మంది అరెస్ట్

author img

By

Published : Sep 4, 2022, 9:25 AM IST

ఒకే పార్టీకి చెందిన వారైనా అధికార యావతో ఒకరు. అన్నదమ్ములే అయినా ఆస్తి తగాదాలతో మరొకరు. వివాహేతర బంధం గొడవలో ఇంకొకరు. ఈ ముగ్గురికి మరో 8మంది తోడయ్యారు. అందరి లక్ష్యం ఒకరే. అడ్డుగా ఉన్న వ్యక్తిని అంతమొందించడం. అచ్చం క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించేలా తండ్రికి గురిపెట్టి... కుమారుడిని కిడ్నాప్‌ చేశారు. చివరకు కటకటాల పాలయ్యారు. హైదరాబాద్‌లో కలకలంరేపిన యువకుడి అపహరణ ఉదంతం... పోలీసుల చాకచక్యంతో సుఖాంతమైంది.

Police arrests 10 including bjp corporator in saroornagar kidnap case
కిడ్నాప్‌ ఉదంతం సుఖాంతం... కార్పొరేటర్ సహా 10 మంది అరెస్ట్

తనకు రాజకీయంగా అడ్డుతగులుతున్న వ్యక్తిని తీవ్రంగా బెదిరించాలని, అతని కొడుకునూ శారీరకంగా హింసించాలని పథకం పన్నిన కార్పొరేటర్‌ చివరికి పోలీసులకు చిక్కారు. సరూర్‌నగర్‌ పీఅండ్‌టీ కాలనీలో శుక్రవారం కలకలం సృష్టించిన యువకుడి కిడ్నాప్‌ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంలో భాజపా కార్పొరేటర్‌ ప్రేం మహేశ్వర్‌రెడ్డి సహా 10 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.

కేసు వివరాలను ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ సీతారాం శనివారం సరూర్‌నగర్‌ ఠాణాలో విలేకర్లకు వివరించారు... సరూర్‌నగర్‌ పీఅండ్‌టీ కాలనీలో భాజపా నేత లంకా లక్ష్మీనారాయణకు, గడ్డిఅన్నారం డివిజన్‌ భాజపా కార్పొరేటర్‌ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డికి మధ్య రాజకీయంగా విభేదాలున్నాయి. మరోవైపు తమ బంధువర్గంలోని ఒక వివాహితతో లక్ష్మీనారాయణ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భాజపా కార్యకర్త శ్రవణ్‌ సైతం ఆయనపై కోపంగా ఉన్నాడు. శ్రవణ్‌, ప్రేమ్‌ మహేశ్వర్‌రెడ్డి కలిసి లక్ష్మీనారాయణను కిడ్నాప్‌ చేసేందుకు గురువారం కుట్ర పన్నారు. లక్ష్మీనారాయణకు, అతని సోదరుడు లంకా మురళి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. వాటి పరిష్కారానికి ప్రేమ్‌ మహేశ్వర్‌రెడ్డి దగ్గరకు వచ్చిన మురళి కుట్రలో భాగస్వామి అయ్యాడు. పథకం అమలుకు మహేశ్వర్‌రెడ్డి భాజపా సానుభూతిపరుడు, సచివాలయంలో పొరుగుసేవల ఉద్యోగిగా పనిచేస్తున్న పునీత్‌ తివారీని సంప్రదించాడు. ఈనెల ఒకటిన పునీత్‌ వనస్థలిపురంలో ఉండే విద్యార్థి పాతబోయిన మంజునాథ్‌(24), ప్రైవేటు ఉద్యోగి పాలపర్తి రవి(38), విద్యార్థులు కందల పవన్‌కుమార్‌రెడ్డి(24), రవల హేమంత్‌(23), కార్‌ వాషింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు రేవళ్లి చంద్రకాంత్‌(24), ఉద్యోగి బలివాడ ప్రణీత్‌(25), కుంభగిరి కార్తీక్‌(25), చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుడు రవి వర్మ(24), మహేశ్‌, మారుతి, సాయి కిరణ్‌తో కలిసి పథకం పన్నారు. అర్ధరాత్రి సమయంలో 2 కార్లలో లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లారు. ఆయన నిద్రిస్తుండడంతో, గణేశ్‌ మండపం వద్ద ఉన్న ఆయన రెండో కుమారుడు సుబ్రహ్మణ్యంను అపహరించారు. నల్గొండ జిల్లా చింతపల్లి దగ్గరకు తీసుకెళ్లారు.

అదేరోజు రాత్రి బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ, సరూర్‌నగర్‌ పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కిడ్నాపర్లు చింతపల్లిలో ఉన్నట్లు కనిపెట్టారు. శుక్రవారం సాయంత్రం చింతపల్లి సమీపంలో నిందితుల్ని పట్టుకుని, బాధితుడిని విడిపించారు. 10 మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించగా శ్రవణ్‌, మహేశ్‌, లంకా మురళీ, మారుతీ, సాయికిరణ్‌లు పరారీలో ఉన్నారు. కారులో తీసువెళ్తూ తనను తీవ్రంగా కొట్టారని, సిగరెట్లతో కాల్చారని బాధితుడు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఓ ఆలయం వద్దకు తీసుకెళ్లి బలిస్తామని, స్నానం చేయాలని మెడలో పూలదండ వేశారని వాపోయారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.