హైదరాబాద్ ఎల్బీనగర్ డివిజన్లో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సుడిగాలి పర్యటన చేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన.. సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రీన్‌పార్క్, సాయినగర్ కాలనీల్లో పాదయాత్ర చేసిన మేయర్ స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతినిత్యం డ్రైనేజీ పొంగిపోర్లుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని పరిశీలించి ఎందుకు చర్యలు చేపట్టడం లేదంటూ అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి కాలనీ నాలాపై ఉన్న స్లాబ్‌ను తొలగించి కొత్త నాలా నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. మేయర్ ఆదేశాలతో యంత్రాంగం వెంటనే పనులు ప్రారంభించింది.
ఇదీ చూడండి: ప్రతిపక్ష పాత్రకే ఎన్సీపీ పరిమితం- ఊహాగానాలకు పవార్ తెర