ETV Bharat / state

సాంస్కృతిక సంబరానికి, సామాజిక బాధ్యతకు వేదిక.. హైదరాబాద్ లిటరరీ వేడుక - 13th edition hyd lit fest concluded

Hyderabad Literary Festival: రెండేళ్ల తర్వాత సరికొత్త శోభతో.. నగరం నడిబొడ్డున ఉన్న విద్యారణ్య పాఠశాలలో ప్రారంభమైన హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్‌ 13వ ఎడిషన్‌కు విశేష ఆదరణ లభించింది. దేశ విదేశాల సంస్కృతులతో.. రకరకాల పుస్తకాల కలయికగా సాహితీ ప్రియులనూ అలరించింది. చిన్నారుల కోసం విభిన్న రకాల వర్క్ షాప్‌లను ఈసారి అందుబాటులోకి తీసుకొచ్చింది.

Hyderabad Literary Festival
Hyderabad Literary Festival
author img

By

Published : Jan 30, 2023, 9:27 PM IST

సాంస్కృతిక సంబరానికి, సామాజిక బాధ్యతకు వేదిక.. హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్‌

Hyderabad Literary Festival: హైదరాబాద్ విద్యారణ్య పాఠశాలలో శుక్రవారం ప్రారంభమైన సాహితీ ఉత్సవం.. మూడు రోజుల ముచ్చటైన పండుగగా సాగింది. సాహిత్యం, కళలు, సంస్కృతి పరిరక్షణే లక్ష్యంగా ఈ వేడుక సాగింది. 2010లో ప్రారంభమైన ఫెస్ట్.. కొవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కావటం ఔత్సాహికులను ఎంతగానో నిరాశపరిచింది. ఈ ఏడాది సరికొత్త జోరుతో మరింత భిన్నంగా సాంకేతికతను అందిపుచ్చుకుని ఆద్యంతం ఆకట్టుకుంది.

అన్ని తరాల వారిని ఆకర్షించిన లిటరరీ ఫెస్ట్: చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని తరాల వారిని ఆకర్షించింది. ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించటంతో పాటు.. జాతీయ అంతర్జాతీయ రచయితలను కలిసే అవకాశాన్ని కల్పించింది. పాఠకులకు, రచయితలకు మధ్య వారధిగా కొనసాగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్‌లో కదిలే బొమ్మల కథలు, మట్టితో, రంగులతో విభిన్న రకాల కళాకృతుల వర్క్‌షాప్‌లు, మ్యూజిక్ బ్యాండ్‌లు, నుక్కాడ్‌షోలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సేవ్ రాక్ పేరుతో రాళ్లను కాపాడుకోవటం పై నిర్వహించిన కార్యక్రమం ఔత్సాహికులను విశేషంగా అలరించింది.

హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ మాత్రం ఇందుకు భిన్నం: సాధారణంగా లిటరరీ ఫెస్ట్ పేరు చెబితే గుర్తొచ్చేవి పుస్తకాలు మాత్రమే . కానీ హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ మాత్రం ఇందుకు భిన్నం. విభిన్న రకాల పుస్తకాలు దొరికే ఈ ఫెస్ట్​లో చిన్నారుల కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్​లు నిర్వహించటం విశేషం. టైం మేనేజ్‌మెంట్‌, మట్టితో బొమ్మల తయారీ, ప్రకృతిని కాపాడుకోకపోతే కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ బుజ్జాయిలను విశేషంగా ఆకర్షించాయి.

సాంస్కృతిక సంబరమే కాదు.. సామాజిక బాధ్యత: స్టోరీ టెల్లర్ మిషన్ పేరుతో చిన్నారులు అప్పటికప్పుడు చిన్న చిన్న కథలను ప్రింట్ తీసుకుని చదివేలా ఏర్పాటు చేసిన యంత్రాలు.. కుకింగ్ వర్క్ షాప్‌లను పిల్లలు ఆసక్తిగా తిలకించారు. సాంస్కృతిక సంబరమే కాదు.. సామాజిక బాధ్యతకు లిటరరీ ఫెస్ట్‌ వేదికగా నిలిచింది. దివ్యాంగ కళాకారులను ప్రోత్సహిస్తూ.. వారు వేసిన పెయింటింగ్‌లను విక్రయించి వారికి అండగా నిలిచింది.

ఇక భాగ్యనగరంలో లైబ్రరీల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఫుడ్ ఫర్ ఛేంజ్ సంస్థ తరపున నిధుల సేకరణ కార్యక్రమం సైతం కొనసాగింది. మొత్తంగా మూడు రోజులపాటు సాగిన హైదరాబాద్ సాహితీ ఉత్సవం నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక చేనేతను ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేసిన మగ్గం, నేత వస్త్రాల ప్రదర్శన తో పాటు... చిన్నారులు చేసిన కళాకృతులు అబ్బురపరిచాయి.

"లిటరరీ అంటే పుస్తకాలు అని అనుకుంటాం. కానీ ఈ ఫెస్ట్​లో ఆర్ట్, కల్చర్ అన్ని ఇందులో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒక దేశాన్ని ఎన్నుకొని ఆ దేశానికి సంబంధించిన కల్చర్, లాంగ్వేజ్ మొదలైన వాటిని ఇక్కడ ఉంచుతాం. అదేవిధంగా దేశంలో ఉన్న ఏదో ఒక భాషను తీసుకొని దానికి సంబంధించిన విషయాలపై అవగాహన కల్పిస్తాం." -సునీతా రెడ్డి, హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ కమిటీ సభ్యురాలు

ఇవీ చదవండి: గ్రూప్ 4 దరఖాస్తుల గడువు పొడిగించిన టీఎస్‌పీఎస్‌సీ

బడ్జెట్ సమావేశాలకు అంతా రెడీ.. అదానీ ఇష్యూపై విపక్షాల గురి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.