ETV Bharat / state

CP CV Anand visit Panjagutta PS: పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో సీపీ సర్‌ప్రైజ్‌ విజిట్‌

CP CV Anand visit Panjagutta PS: హైదరాబాద్ నగర నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్‌ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. సర్‌ప్రైజ్‌ విజిట్‌లో భాగంగా ఈ స్టేషన్‌కు వచ్చానని సీపీ తెలిపారు.

author img

By

Published : Dec 29, 2021, 4:29 PM IST

CP CV Anand visit Panjagutta PS , hyderabad cp cv anand
పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో సీపీ సీవీ ఆనంద్ సర్‌ప్రైజ్‌ విజిట్‌

CP CV Anand visit Panjagutta PS : హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలోని ఠాణాలు ఉత్తమ పనితీరుని కనబరుస్తున్నాయని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు, కేసులు, ఠాణా పరిసరాలు పరిశీలించారు. ఏటా పంజాగుట్ట స్టేషన్‌లో సుమారు 600 కేసులు నమోదు అవుతాయన్నారు. పంజాగుట్ట పరిధిలో బందోబస్తు అధికంగా ఉండటం వల్ల సిబ్బందిపై పనిభారం పడుతోందన్నారు. అయినప్పటికీ 175 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఆనంద్‌ వివరించారు. 2017లో దేశంలోనే రెండో ఉత్తమ పోలిస్‌స్టేషన్‌గా అవార్డు సాధించిందని గుర్తు చేశారు. అన్ని పోలీస్‌ స్టేషన్లలో సోలార్ ప్లాంట్లు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో సర్​ప్రైజ్​ విజిట్​కు వచ్చాను. ప్రతిఫ్లోర్​లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పార్కింగ్ కోసం స్థలం కేటాయించారు. రెస్ట్ రూములు కూడా ఉన్నాయి. విజిటర్స్ కోసం పిటిషన్ ఇంక్వైరీ డెస్క్ చాలా నిర్వర్తిస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్​ను చాలా బాగా మెయిన్​టెయిన్ చేస్తున్నారు. ఇక్కడి అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నాను. పనితీరును పరిశీలించడానికి సర్​ప్రైజ్ అవసరం అని నేను భావిస్తున్నాను. రాత్రి సమయంలోనూ నేను తనిఖీలు చేస్తా. పరిస్థితి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే తరుచూ ఆకస్మిక తనిఖీలు చేస్తాం.

-సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ

సర్‌ప్రైజ్‌ విజిట్‌లో బుధవారం ఈ స్టేషన్​కు వచ్చానని... పోలీసుల పనితీరును పరిశీలించేందుకు తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీ శ్రీనివాస్‌, ఏసీపీ గణేశ్‌, ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి, డీఐ నాగయ్య, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Road Accidents in cyberabad 2021: ఆ సమాయాల్లోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు... జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.