ETV Bharat / state

వివిధ కేసుల్లో ఆరుగురు నిందితులు అరెస్ట్​: సీపీ అంజనీకుమార్​

author img

By

Published : Apr 24, 2021, 3:55 PM IST

హైదరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో ఇటీవల నమోదైన పలు కేసులను ఛేదించినట్లు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. వివిధ కేసులకు సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ​

Hyderabad CP Anjanikumar
Hyderabad CP Anjanikumar

హైదరాబాద్​ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నకిలీ బంగారం కేసును ఛేదించినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. మోసానికి పాల్పడిన నిందితులు శివయ్య, తిరుపతయ్య, ఇంద్రాజులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు.

ఇదీ జరిగింది..

మైసూర్‌ తవ్వకాల్లో లంకె బిందెల్లో బంగారం దొరికింది.. కొంటారా అంటూ శివయ్య, తిరుపతయ్య, ఇంద్రాజులు చాంద్రాయణగుట్టకు చెందిన ఓ వ్యక్తికి ఫోన్‌ చేశారు. రూ.70 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. మొదట అసలు బంగారాన్ని చూపి.. ఆ తర్వాత అతనికి నకిలీ బంగారం ఇచ్చి మోసం చేశారు. వీళ్లపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు సీపీ తెలిపారు.

చైన్​ స్నాచింగ్​ కేసు..

ఈ నెల 21న జూబ్లీహిల్స్‌లో మహిళ మెడలో నుంచి గొలుసు దొంగిలించిన కేసును ఛేదించినట్లు సీపీ చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు శివను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై గతంలో నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆరు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

కేసీఆర్​పై వదంతులు..

తీన్మార్‌ మల్లన్న పేరుతో వాట్సాప్​ గ్రూపు సృష్టించి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తోన్న మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సీపీ అన్నారు.

ధర్నాలు వద్దు..

కరోనా దృష్ట్యా పోలీస్‌ సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి అప్రమత్తంగా ఉండాలని అంజనీకుమార్ సూచించారు. కొవిడ్​ విపత్కర పరిస్థితుల్లో ధర్నాలు, ముట్టడి లాంటి కార్యక్రమాలు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామని.. ఏదైనా అవసరమైతే 9490616780 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఇదీ చూడండి: కొవిడ్‌ వ్యాప్తితో పోలీసుల వెనుకంజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.