డయల్ 100 ప్రజల కోసమే ఉందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో వెస్ట్ జోన్ పోలీసుల పనితీరు పర్యవేక్షించారు. ఉత్తమ పోలీసులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
జీరో ఎఫ్ఐఆర్ రాష్ట్రంలో అమల్లో ఉందని తెలిపారు.పెట్రోలింగ్ సిస్టమ్‌ను మరింత మెరుగుపరుస్తామని సీపీ అన్నారు. రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులు, పిల్లల కోసం ప్రత్యేక భద్రతాచర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.