హైదరాబాద్‌లో నకిలీ నోట్లు తయారు చేస్తున్న రెండు ముఠాలకు చెందిన 13 మందిని అరెస్ట్ చేసి రూ.17.7 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ నలుగురి నుంచి రూ. 8.5 లక్షల నకిలీ నోట్లు, ఆరు ఫోన్లు, ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం సుకున్నారు. వాటిలో రెండు వేలు, ఐదు వందల నోట్లున్నాయి.
వీరిచ్చిన సమాచారంతో అబిడ్స్, జగదీశ్ మార్కెట్ ప్రాంతాల్లో నకిలీ నోట్లు సరఫరా చేస్తున్న ఆరుగురిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేసింది. వారి నుంచి రూ. 9.3 లక్షల విలువైన నోట్లు పట్టుకున్నట్లు సీపీ తెలిపారు. ఆ తర్వాత దర్యాప్తులో మరో ముగ్గురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండిః గూగుల్‌నే మోసం చేసిన ఘనుడు.. ఎలాగో చూడండి!