ETV Bharat / state

భాగ్యనగరంలో 307 సమస్యాత్మక ప్రాంతాలు: సీపీ

జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు: సీపీ

author img

By

Published : Nov 25, 2020, 3:33 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. మొత్తం 4,979 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. సమస్యాత్మక ప్రాంతాలు 601 ఉండగా... అందులో 1,704 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు 307కాగా... అక్కడ 1,085 పోలింగ్ కేంద్రాలు గుర్తించామన్నారు.

నగర పరిధిలో 15 చెక్​పోస్టులు ఏర్పాటు చేశామన్న సీపీ... ఇప్పటివరకు రూ. కోటి 40 లక్షల నగదు, 80 గ్రాముల మత్తు పదార్థాలు, 2.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 2,785 మంది రౌడీషీటర్లపై బైండోవర్ కేసులు నమోదు చేశామని వివరించారు. ఇప్పటివరకు 3,744 మంది తమ ఆయుధాలు డిపాజిట్ చేశారన్నారు.

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన 23 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. సాంకేతిక సాయంతో పోలింగ్ కేంద్రాల వద్ద తనిఖీలు చేస్తున్నామని... సామాజిక మాద్యమాలపై నిఘా పెట్టామని వెల్లడించారు. మహిళల భద్రత కోసం ఆరు షీ బృందాలు విధులు నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు.

ఇవీచూడండి: భాజపా జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం... రేపే విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.