ETV Bharat / state

మంత్రి శ్రీనివాస్​గౌడ్​, సీపీ అంజనీకుమార్ టగ్ ఆఫ్ వార్​

author img

By

Published : Feb 12, 2021, 10:48 AM IST

Updated : Feb 12, 2021, 1:48 PM IST

హైదరాబాద్ గోషామహల్‌ మైదానంలో కమిషనరేట్ వార్షిక క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​, అంజనీకుమార్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌ ఆడారు.

టగ్‌ ఆఫ్‌ వార్ ఆడిన మంత్రి శ్రీనివాస్​గౌడ్​, సీపీ అంజనీకుమార్​

హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. గోషామహల్‌ మైదానంలో పోలీసు సిబ్బందికి నాలుగు రోజుల పాటు క్రీడలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని అన్ని జోన్లు, విభాగాల నుంచి... ఈ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించారు.

ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ అన్నారు. ప్రతి పనిలోనూ బృందస్ఫూర్తి అవసరమన్న సీపీ.... అందుకు స్పోర్ట్స్‌ మీట్‌లు బాగా ఉపయోగపడతాయన్నారు. ముగింపు ఉత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌... ఈ సందర్భంగా... అంజనీకుమార్‌ సహా పలువురు అధికారులతో టగ్‌ ఆఫ్‌ వార్‌ ఆడారు. పోలీసుల జాగిలాల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి.

గతంలో పోలీసులను చూస్తే ప్రజలు భయపడి ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చే వాళ్లు కాదని... ప్రస్తుతం ఫ్రెండ్లీ పోలీసింగ్​తో పోలీసులు.. ఇంట్లో కుటుంబ సభ్యుల్లా మారారని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరోనా వేళ పోలీసులు ముందుండి.... ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని వెల్లడించారు. ఉపాధి లేక ఇబ్బందులు పడిన కూలీలు, కార్మికులకు పోలీసులు భోజనం, నిత్యావసర సరకులు అందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని తెలిపారు.

Last Updated : Feb 12, 2021, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.