ETV Bharat / state

HCU Appeal on lands: భూములపై సింగిల్​ జడ్జి తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన హెచ్​సీయూ - హెచ్​సీయూ భూముల వివాదం

HCU Appeal on lands: భూములపై చట్టబద్ధ హక్కులు లేవంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ధర్మాసనం వద్ద అప్పీలు చేసింది. కేవలం పత్రాలు, ఉత్తర్వులు లేవన్న కారణంగా హక్కులు లేవని తీర్పునివ్వడం సమంజసం కాదని అప్పీలులో హెచ్​సీయూ పేర్కొంది.

HCU Appeal on lands
HCU Appeal on lands
author img

By

Published : Jan 8, 2022, 10:13 PM IST

HCU Appeal on lands: భూములపై చట్టబద్ధ హక్కులు లేవంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హెచ్​సీయూ... ధర్మాసనం వద్ద అప్పీలు చేసింది. ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటైన యూనివర్సిటీకి ప్రభుత్వం కేటాయించిన భూములు 1975 నుంచి తమ అధీనంలోనే ఉన్నాయని యూనివర్సిటీ వివరించింది. ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాల్లో భూమి యూనివర్సిటీదేనని స్పష్టంగా ఉందని తెలిపింది. వీటన్నింటినీ న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోకుండా... భూములపై హెచ్​సీయూకి చట్టబద్ధ హక్కులు లేవంటూ తీర్పునిచ్చారని హెచ్​సీయూ తరఫు న్యాయవాది వాదించారు.

జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న రోడ్డును వినియోగించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్న హెచ్​సీయూ అభ్యర్థనను తిరస్కరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం... పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఇదీ జరిగింది..

హెచ్​సీయూ కోసం 1975లో రాష్ట్ర ప్రభుత్వం 2 వేల 324 ఎకరాలను కేటాయించింది. అయితే భూములపై హక్కులు కల్పిస్తూ ఉత్తర్వులు లేవని హైకోర్టు పేర్కొంది. తమకు మరోచోట భూమిని కేటాయించాలంటూ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని.. 2013లో క్రీడా అకాడమీ ఏర్పాటు కోసం 500 ఎకరాలను హెచ్​సీయూ ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్​కు కేటాయించింది. ఆ తర్వాత ఐఎంజీని భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో.. వివాదం ఏర్పడింది. ఆ వివాదంలోనూ హెచ్ సీయూ ప్రతివాదిగా లేదంటే.. భూమి ప్రభుత్వం వద్దే ఉన్నట్లని హైకోర్టు పేర్కొంది.

సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు..

తమకు 500 ఎకరాలు పోగా మిగిలిన భూమిని చట్టబద్ధంగా కేటాయించాలని 2013లో ప్రభుత్వాన్ని హెచ్​సీయూ కోరింది. ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ హెచ్​సీయూకి 1626 ఎకరాలు కేటాయించి... 159 ఎకరాలు ప్రజా ప్రయోజనాల కోసం రిజర్వ్​లో ఉంచాలని సిఫార్సు చేసింది. రిజర్వ్ చేయాలని కమిటీ సిఫార్సు చేసిన భూముల్లోనే ప్రస్తుత రోడ్డు నిర్మాణం జరుగుతోదంని తీర్పులో హైకోర్టు పేర్కొంది. రోడ్డు నిర్మాణం కోసం అవసరమైతే భూసేకరణ చేయాలన్న హెచ్​సీయూ వాదనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. చట్టబద్ధమైన హక్కులే లేనప్పుడు భూసేకరణ ప్రశ్నే తలెత్తదని పేర్కొంది. ఎన్జీవో కాలనీలో ఇప్పటికే విశాలమైన రోడ్డు ఉన్నందున.. ప్రస్తుతం నిర్మిస్తున్న రహదారి అవసరం లేదన్న వాదననూ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రోడ్డు ఎక్కడ నిర్మించాలనేది విశాల ప్రయోజనాలను దృష్టిలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. రికార్డుల్లో పోరంబోకు భూమిగా ఉన్నందున ప్రభుత్వం జీహెచ్ఎంసీకి కేటాయించిందని తెలిపింది. హెచ్​సీయూ పిటిషన్​ను కొట్టివేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్.. భూములపై హక్కుల కోసం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చునని తీర్పులో హెచ్​సీయూకి సూచించారు.

సంబంధిత కథనాలు: Hc On Hcu Lands: 'ఆ భూములపై హెచ్​సీయూకి ఎలాంటి హక్కుల్లేవు'

యూనివర్సిటీ భూముల్లో రోడ్డు ఎలా నిర్మిస్తారు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.