హైదరాబాద్లో ఏర్పాటు చేసిన 33వ జాతీయ పుస్తక ప్రదర్శన ముగిసింది. పది రోజుల పాటు పుస్తక ప్రియులను ఆకర్షించిన ఈ ప్రదర్శనను 10 లక్షల మంది సందర్శించినట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
330కి పైగా ఏర్పాటైన స్టాళ్లలో వివిధ భాషల్లో పుస్తకాలను ప్రజలు కొనుగోలు చేశారు. పుస్తక ప్రదర్శను గత పది రోజుల్లో పలువురు ప్రముఖులు సందర్శించారు. 1985లో అశోక్ నగర్లోని సెంట్రల్ లైబ్రరీలో చిన్నస్థాయిలో ఏర్పాటైన పుస్తక ప్రదర్శన నేడు ఈ స్థాయికి చేరుకోవటం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సారి అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచారని సందర్శకులు హర్షం తెలిపారు.
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్