స్టేట్మెంట్కు.. సాక్ష్యాలకు పొంతన ఏది..?
గత ఏడాది అక్టోబర్లో 80 లక్షలు ఆర్.టి.జి.ఎస్. ద్వారా జయరాం ఖాతాల్లో నగదు పంపించానని రాకేష్ పోలీసులకు చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఒక ఆధారాన్ని కూడా ఇవ్వలేదు. మరోవైపు రాకేష్ రెడ్డి 25 లక్షలు వడ్డీకి ఇస్తానంటూ చెప్పడంతో ఆశపడిన సినీనటుడు సూర్య ప్రకాష్ అలియాస్ డుంబు... ఈ కేసులో ఇరుక్కుపోయాడు. జైరాంను హనీ ట్రాప్ ద్వారా రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చినందుకు.. అతడిని పోలీసులు విచారించారు.
మరోవైపు విచారణ గడువు ముగిసిపోవడంతో... పోలీసులు రాకేశ్ రెడ్డిని కోర్టుకు హాజరు పరిచారు. 3రోజుల విచారణలో లభించిన వివరాలు ఆధారంగా పక్కాగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని పశ్చిమ మండలం డిసిపి శ్రీనివాస్ తెలిపారు.