రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. దంపతులిద్దరూ రోజంతా కూలి పని చేసి పొట్టపోసుకునేవారు. ఉన్నట్టుండి భార్య అనారోగ్యంతో మృతిచెందింది. కనీసం అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వ లేక... ఆ అభాగ్యుడు మృతదేహాన్ని చెరువు సమీపంలో పూడ్చిపెట్టడాని (to bury in the pond)కి ప్రయత్నిస్తే స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు ఆరా తీస్తే విషాదగాథ వెలుగులోకి వచ్చింది.
ఏపీలోని నెల్లూరు జిల్లా కలిగిరి మండలం ఈనకల్లు గ్రామానికి చెందిన డేగ శ్రీను 11 ఏళ్ల క్రితం బెంగళూరులో మేస్త్రీ పని చేస్తుండగా కర్ణాటకకు చెందిన లక్ష్మి(30)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆర్నెల్ల కిందట వీరు నగరానికి వచ్చి హయత్‌నగర్ పాతరోడ్డులోని హనుమాన్ మందిరం పక్కనే ఉన్న గల్లీలో అద్దెకుంటున్నారు. ఇద్దరూ భవన నిర్మాణ కూలీలుగా పనిచేసేవారు.
లక్ష్మి కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇంటివద్దనే ఉంటోంది. విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న ఆమె భోజనం సరిగా చేయడం లేదు. శ్రీను గురువారం పని నుంచి సాయంత్రం 7 గంటలకు ఇంటికొచ్చాడు. అప్పటికే తీవ్ర అస్వస్థతతో ఉన్న లక్ష్మి కొద్దిసేపటికే (Tragedy Incident in Hayathnagar) మరణించింది. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో దగ్గర్లోని బాతుల చెరువు వద్ద ఖననం చేయాలని నిర్ణయించాడు. తన బంధువు కోడూరి వినోద్ సాయంతో మృతదేహాన్ని దుప్పట్లో చుట్టుకొని చెరువు వద్దకు మోసుకెళ్లాడు. అక్కడ పూడ్చిపెట్టేందు(to bury in the pond)కు ప్రయత్నిస్తుండగా, స్థానికులు అడ్డగించారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి అనారోగ్యంతోనే చనిపోయినట్లు శుక్రవారం పోస్టుమార్టం అనంతరం గుర్తించారు. శ్రీను, లక్ష్మిల బంధువులను పిలిపించి, మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.