ETV Bharat / state

ప్రజావాణికి ఊహించని స్పందన - అర కిలోమీటర్ వరకు బారులు తీరిన అర్జీదారులు - సీఎం రేవంత్ ప్రజావాణికి భారీ స్పందన

Huge Response to CM Revanth Prajavani : ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించే ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ప్రజా భవన్​లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చారు. దాదాపు అరకిలోమీటరు మేర ప్రజలు బారులు తీరారు. ప్రజాభవన్ ముందు రాకపోకలకు అంతరాయం కలకగకుండా పోలీసులు క్రమబద్ధీకరించారు. రెండు పడక గదుల ఇళ్లు, పెన్షన్లు, భూముల సమస్యలపై అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. దివ్యాంగుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Government Getting Lot of Complaints in Prajavani
Huge Response to CM Revanth Prajavani
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 7:18 PM IST

ప్రజావాణికి ఊహించని స్పందన - అర కిలోమీటర్ వరకు బారులు తీరిన అర్జీదారులు

Huge Response to CM Revanth Prajavani : జ్యోతిబా ఫులే ప్రజాభవన్​లో నిర్వహించిన ప్రజావాణికి, ప్రజా సమస్యలపై ఫిర్యాదులు పోటెత్తాయి. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడానికి వచ్చిన ఫిర్యాదుదారులతో ప్రజాభవన్ కిక్కిరిసింది. ఇవాళ తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చిన, అర్జీదారులు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. సమస్యలను దరఖాస్తుల రూపంలో సమర్పించారు.

అధికారులు ప్రజల పేర్కొన్న సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరం నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలకు ప్రత్యేక క్యూలైన్లలో ప్రజాభవన్​లోకి అనుమతించారు. దాదాపు అరకిలోమీటరు మేర ప్రజలు బారులు తీరారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీల్ చైర్లలో వారిని సిబ్బంది లోపలికి తీసుకువెళ్లారు.

రాజ భవనాన్ని తలపిస్తున్న ప్రజా భవన్‌ - లోపలి దృశ్యాలను చూస్తే వావ్ అనాల్సిందే

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఖాళీ స్థలం పట్టా మా దగ్గర ఉంది. నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్​రూం ఇళ్లు ఇస్తామంటే, ఆ ప్రభుత్వానికి మా ఖాళీ స్థలం ఇచ్చాము. కానీ మా మండల ఎమ్​ఆర్వో, గ్రామ ప్రజలు అంతా కలిసి అన్యాయం చేశారు. మాకు రెండు పడకల గది ఇవ్వలేదు. కలెక్టర్​కు సైతం ఎన్నో అర్జీలు సమర్పించాం. కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. కనీసం ఇళ్లు లేకపోయినా మా ఖాళీ స్థలమైనా మాకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాను-ఫిర్యాదుదారు

Government Getting Lot of Complaints in Prajavani : రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి హాజరయిన ప్రజలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఎక్కువగా తమకు పెన్షన్లు అందడం లేదని, రెండు పడక గదుల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు కావడం లేదంటూ విన్నవిస్తున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున భూ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పాటు పలు రకాల సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందాయి.

Public Talk on Prajavani Program in Telangana : గత ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోలేదని, ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించ లేదని ప్రజలు వివరించారు. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడ్డామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం వలన సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజావాణి సందర్భంగా పోలీసులు ప్రజాభవన్ వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

నాకు చిన్నప్పటి నుంచి కళ్లు కనిపించటం లేదు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫించన్ వచ్చింది. మళ్లీ టీఆర్ఎస్ వచ్చాక ఫించన్ బంద్ చేశారు. ఎన్నో అర్జీలు పెట్టి తిరిగినా లాభం లేకుండా పోయింది. ఇస్తామంటూనే పదేళ్లు గడిపేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ నాగోడు పట్టించుకుంటుందని నేను విశ్వసిస్తున్నాను-ఫిర్యాదుదారు

రూ.500కే గ్యాస్​ సిలిండర్​ హామీ అమలుకు ప్రతిపాదనలు సిద్ధం - వీరే అర్హులు!

నేటి నుంచి మహాలక్ష్ములకు జీరో టికెట్ - ఆ గుర్తింపు కార్డు తప్పనిసరి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.