RAIN IN HYD: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. వరుణుడి రాకతో నగర రహదారులన్నీ జలమయమయ్యాయి. నాంపల్లి, బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి, బేగంబజార్ ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. సుల్తాన్‌బజార్, కాచిగూడ, అంబర్‌పేట, గోల్నాకలో వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.
నారాయణ గూడ, హిమాయత్ నగర్, లక్డీకాపూల్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో వాహనదారులు తడిసిముద్దయ్యారు. భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో వర్షపు నీరు పెద్దఎత్తున రోడ్లపై నిలవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ఇవీ చదవండి:
Rain in Telangana Today : తెలంగాణలో వర్షం.. తడిసిముద్దవుతున్న జనం