ETV Bharat / state

తెగ తాగేశారు: తొలిరోజు మద్యం వ్యాపారం ఎన్నికోట్లో తెలుసా?

సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్న మద్యం దుకాణాల్లో...తొలిరోజు అమ్మకాలు జోరుగా సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 45కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇదే లెక్కన అమ్మకాలు జరిగితే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

huge liquor selling in telangana for first day
రాష్ట్రంలో మద్యం జోరు.. తొలి రోజు రూ.45 కోట్లు
author img

By

Published : May 7, 2020, 7:45 AM IST

లాక్​డౌన్ నేపథ్యంలో దాదాపు నెలన్నర తర్వాత మద్యం అమ్మకాలు మొదలవడం వల్ల జనం బుధవారం ఉదయం నుంచే దుకాణాల ముందు బారులు తీరారు. విక్రయాల కోసం ముందే ఏర్పాట్లు చేసిన అబ్కారీ అధికారులు 15 రోజులకు సరిపడా మద్యం నిల్వలు ఉన్నట్లు నిర్ధరించారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జోరుగా మద్యం అమ్మకాలు సాగాయి. 16 శాతం పెరిగి కొత్త ధరకే మద్యం విక్రయాలు జరగ్గా... సాధారణం కంటే 5కోట్ల రూపాయల అదనపు ఆదాయం నమోదైంది. మొత్తంగా తొలిరోజు 45 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం మద్యం డిపోల నుంచి సుమారు 60కోట్ల విలువైన మద్యం దుకాణాలకు సరఫరా అయింది.

28 మంది లైసెన్సీలపై అబ్కారీ శాఖ కొరఢా

లాక్‌డౌన్‌ సమయంలో గుట్టుచప్పుడు కాకుండా అధిక ధరలకు మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకున్న 28 మంది లైసెన్సీలపై అబ్కారీ శాఖ కొరఢా ఝులిపించింది. మరో ఆరు దుకాణాల్లో మద్యం నిల్వల్లో తేడా ఉన్నట్లు గుర్తించి...ఆ లైసెన్సీలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. పర్మిట్‌ గదులకు అనుమతి లేదని స్పష్టం చేసిన ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్‌... నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆబ్కారీ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో మీడియాలో వచ్చే ప్రతికూల వార్తలు నోట్‌ చేసుకునేందుకు ఓ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. వార్తల ఆధారంగా అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

ఇవీచూడండి: మందు భామలం మేము.. క్యూ కడతాము..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.