ETV Bharat / state

దీపావళి సందర్భంగా కళకళలాడుతున్న మిఠాయి దుకాణాలు - diwali sweets

దీపావ‌ళి వెలుగు జిలుగుల దీపకాంతుల పండుగ‌. చీకటిని పారద్రోలి బతుకుల్లో వెలుగులు నింపే దీపావళి సందర్భంగా ఆత్మీయులకు మిఠాయిలు బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీ. నగరవాసుల కోసం నోరూరించే స్వీట్లు అంగట్లో సిద్ధంగా ఉన్నాయి. జంటనగరాల్లో మిఠాయి దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.

దీపావళి సందర్భంగా కళకళలాడుతున్న మిఠాయి దుకాణాలు
author img

By

Published : Oct 26, 2019, 5:52 AM IST

Updated : Oct 26, 2019, 6:44 AM IST

వెలుగులు విరజిమ్మే దీపావళి ఇంటిల్లిపాది ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. దివ్వెల పండుగ రోజున ప్రియమైన వారికి మిఠాయిలు బహుమతిగా ఇస్తుంటారు. ఆత్మీయులు, అధికారులు, ఉద్యోగులకు, సన్నిహితులకు మిఠాయి బహుమతులు పంపిణీ చేసుకునే తీయని వేడుక. ప్రజల అభిరుచులకు అనుగుణంగా దుకాణదారులు సరికొత్త రుచులు, ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. మిఠాయి ప్రియులతో నగరంలోని దుకాణాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది.

ఆకర్షణీయమైన ప్యాకెట్లులో సిద్ధం

మిఠాయిలను విభిన్న రకాల్లో ఆకర్షణీయంగా ప్యాక్ చేసి ఇచ్చే సంస్కృతి క్రమంగా పెరుగుతోంది. ఎండు ఫలాలతో కూడిన మిఠాయిల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ధరలు ఎక్కువగా ఉన్నా.. ప్రియమైన వారికి కొత్త రుచులు చూపించేందుకు వెనకాడడంలేదు.

అందరూ తినే విధంగా

ఆరోగ్య కారణాల రీత్యా తీపి పదార్థాలకు దూరంగా ఉండేవారిని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ధోరణి మారుస్తున్నారు. మధుమేహం తదతర వ్యాధులు ఉన్న వారు తినేందుకు వీలుగా... విభిన్న రకాల మిఠాయిలు సిద్ధం చేస్తున్నారు. నాణ్యతతో పాటు రుచికి... పెద్దపీట వేస్తున్నారు.

దీపావళి సందర్భంగా కళకళలాడుతున్న మిఠాయి దుకాణాలు

ఇదీ చూడండి: ఓరుగల్లులో దీపావళి వేడుకలు.. నరకాసుర వధకు ఎర్రబెల్లి

Last Updated : Oct 26, 2019, 6:44 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.