Huge Crowd for Prajavani at Prajabhavan : మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్(praja bhavan) జనసంద్రంగా మారింది. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి బారులు తీరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణి(Prajavani) కార్యక్రమంలో మంగళవారం, శుక్రవారం మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తుండటంతో ప్రజలు పెద్ద ఎత్తున ప్రజాభవన్‌కు తరలివచ్చారు.
ప్రజా దర్బార్ ఇకపై ప్రజావాణి - టైమింగ్స్ ఇవే
Good Response to Prajavani : ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి దాసరి హరిచందన బాధిత ప్రజల నుంచి స్వయంగా దరఖాస్తులు స్వీకరించి వారికి ప్రభుత్వం తరపున భరోసా ఇస్తున్నారు. తండ్రి చనిపోయాడని, తన తల్లికి ఫించన్ రాక ఇంటి పనులు చేస్తూ తనను పోషిస్తోందని ఓ చిన్నారి ప్రజావాణికి డబుల్ బెడ్ రూం(Double Bedroom House) కావాలంటూ దరఖాస్తుతో వచ్చి కన్నీటిపర్యంతమైంది.
అలాగే ధరణి పోర్టల్ వల్ల తన తండ్రి పేరిట ఉన్న భూమి కనిపించకుండా పోయిందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ తనకు రెండుసార్లు గుండె సంబంధిత ఆపరేషన్ అయిందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని వినతిపత్రం సమర్పించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వికలాంగుల కింద తనకు పింఛన్ మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు.
ప్రజావాణికి పోటెత్తిన జనం - భూ సమస్యలే అధికం
తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్రం కోసం పోరాడి తన రెండు కాళ్లు, చేతు పోగొట్టుకున్న వ్యక్తి ప్రజావాణిని ఆశ్రయించాడు. గత ప్రభుత్వం తనకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చాయని తెలపారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తనను ఆదుకోవాలని వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజాభవన్‌లో నిర్వహించే ప్రజావాణిని జిల్లాలో కూడా పటిష్టంగా అమలు చేయాలని పలువురు ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అయ్యేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చి తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకోవడం, వాటిని అధికారులు జాప్యం చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు బాధిత ప్రజలు వాపోయారు.
"నేను తెలంగాణ ఉద్యమ సమయంలో మిర్యాలగూడ వద్ద నిర్వహించిన రైల్‌రోకోలో నా రెండు కాళ్లు, చేయి పోగొట్టుకున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాకు అండగా ఉంటానని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఉద్యోగం ఇస్తానని కేటీఆర్ మాట ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు. ఈ ప్రభుత్వంలోనైనా నాకు న్యాయం చేయ్యాలి. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలి". - నాగరాజు, ఫిర్యాదుదారుడు
ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన - అర కిలోమీటర్ వరకు బారులు తీరిన అర్జీదారులు
ప్రజాదర్బార్‌కు విశేష స్పందన- సేవను మించిన తృప్తి లేదంటూ సీఎం ఎమోషనల్ ట్వీట్