ETV Bharat / state

వరద బాధితులతో కిక్కిరిసిన మీ సేవ కేంద్రాలు - మీ సేవ కేంద్రాలకు పోటెత్తిన వరద బాధితులు హైదరాబాద్​

వరద బాధితులతో భాగ్యనగర మీ సేవ కేంద్రాలు కళకళలాడాయి. వరదల వల్ల నష్టపోయిన బాధితులు పరిహారం కోసం ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలన్న ప్రభుత్వం ఉత్తర్వులతో బాధితులు మీ సేవ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. అయితే ఈ ప్రక్రియ తమకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, నేరుగా ఇళ్ల వద్దకు వచ్చి ఆర్థిక సాయం అందజేయడం అందరికీ శ్రేయస్కరమని పలువురు మహిళలు పేర్కొన్నారు.

వరద బాధితులతో కిక్కిరిసిన మీ సేవ కేంద్రాలు

author img

By

Published : Nov 16, 2020, 7:05 PM IST

వరద బాధితులతో హైదరాబాద్​లోని మీ సేవ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. నగరంలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందని వరద బాధితులకు నేరుగా బ్యాంక్ అకౌంట్ ద్వారా రూ. 10 వేలు అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే అందుకు గాను బాధితులు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వరద బాధితులు మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరారు.

huge crowd at mee seva centers with flood victims in hyderabad
దరఖాస్తు నింపుతున్న వరద బాధితులు

మీ సేవ కేంద్రాలు ఎప్పుడు తెరుస్తారా అని ఆయా కేంద్రాల ముందు మురికి వాడలు, బస్తి తదితర ప్రాంతాల ప్రజలు గంటల తరబడి కూర్చున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని చిక్కడ పల్లి, రామ్ నగర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లో ఇతర సేవల కన్నా వరద బాధితుల దరఖాస్తుల నమోదు ప్రక్రియ కోసం వందలాది మంది క్యూ కట్టారు.

ఈ ప్రక్రియ తమకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, నేరుగా ఇళ్ల వద్దకు వచ్చి ఆర్థిక సాయం అందజేయడం అందరికీ శ్రేయస్కరమని పలువురు మహిళలు పేర్కొన్నారు. కొవిడ్- 19 పెరుగుతుందని ఒకవైపు ప్రకటిస్తూ.. మరోవైపు పరోక్షంగా ప్రభుత్వమే వైరస్ విస్తరించే విధంగా చర్యలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్థిక సహాయం పంపిణీలో నాయకుల పెత్తనం బాగా పెరిగిందని వారు ఆరోపించారు. ఈ ఆర్థిక సహాయం అతి త్వరగా తమకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: ఘర్షణకు దారితీస్తోన్న వరద బాధితులకు ఆర్థిక సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.