ETV Bharat / state

కరోనా కలవరం: ఒక్క రోజులో 758 కరోనా కేసులు, 4 మరణాలు - andhrapradhesh corona active cases

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 758 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, కొవిడ్ టీకా తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.

ఏపీ కరోనా
ఏపీ కరోనా
author img

By

Published : Mar 25, 2021, 7:44 PM IST

ఏపీలో కొత్తగా 758 కరోనా కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,95,879కు చేరింది. మరణాల సంఖ్య 7,201 కి పెరిగింది. వైరస్ నుంచి మరో 231 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం ఏపీలో 3,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 35,196 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు...

చిత్తూరులో అత్యధికంగా 175 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 127, విశాఖలో 98, కృష్ణాలో 80, అనంతపురంలో 56, తూర్పుగోదావరిలో 45, నెల్లూరులో 33, ప్రకాశంలో 30, శ్రీకాకుళంలో 27, కడపలో 24, విజయనగరంలో 23, పశ్చిమగోదావరిలో 13 కరోనా కేసులు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు.

ఏపీ కరోనా
ఏపీ కరోనా

ఇదీ చూడండి: ఐటీఐఆర్​ ప్రాజెక్టుపై కేంద్రం వైఖరేంటి: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.