ETV Bharat / state

'నిలోఫర్​ ఆస్పత్రిలో పురుగుల భోజనం'పై హెచ్​ఆర్సీలో కేసు

author img

By

Published : May 1, 2021, 4:28 AM IST

నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వైద్య సిబ్బందికి పెట్టే భోజనంలో పురుగులు రావడంపై హెచ్​ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును సుమోటోగా స్వీకరించింది. ఘటనపై నివేదిక సమర్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్​కు ఆదేశాలు జారీ చేసింది.

నిలోఫర్​ ఆస్పత్రిపై కేసు
నిలోఫర్​ ఆస్పత్రిపై కేసు

హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు పంపిణీ చేస్తున్న భోజనంలో పురుగులు రావడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలను కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది.

ఇటీవల నిలోఫర్ ఆస్పత్రిలో రోగులకు, వైద్య సిబ్బందికి పెట్టే అన్నంలో కూరలో పురుగులు కనిపించడంతో ఓ రోగి సహాయకుడు ఆస్పత్రిలో ఆందోళన చేశాడు. ఈ విషయంపై రోగి సహాయకుడు, వైద్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్​కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా సూపరింటెండెంట్ పట్టించుకోలేదని వారు ఆరోపించారు.

ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై మే 15లోగా నిలోఫర్ సూపరింటెండెంట్ నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి: అంతిమ విజయం ధర్మానిదే: ఈటల రాజేందర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.