Watermelon for Summer Skin Care : మారుతున్న కాలాన్ని బట్టి చర్మ సంరక్షణ అనేది అవసరం. మరీ ముఖ్యంగా వేసవిలో ముఖ సౌందర్యం కోసం ముఖ్యమైన జాగ్రత్తలు ఎంతైనా అవసరం. ఎండ, వేడి, తేమతో కూడిన వాతావరణంలో మన ముఖ సౌందర్యం మెరుగుపరుచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫేస్ వాష్, ఫేషియల్ మిస్ట్, షుగర్ స్క్రబ్, ఫేస్ మాస్క్ అనేవి ముఖ్యమైనవి. మరి అవెలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫేషియల్ మిస్ట్ : పుచ్చకాయ తినటంలోనే కాదు.. అది ముఖానిరి కూడా ఎంతో ఆరోగ్యకరం. పుచ్చకాయంలో నీరు అధికశాతం ఉంటుంది. ఇది చర్మాన్ని సహజంగా తేమగా ఉంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. పుచ్చకాయని ముక్కలుగా చేయాలి. పుచ్చకాయ నుంచి రసం తీయాలి. ఆ పుచ్చకాయ రసానికి కాసింత నిమ్మరసం కలిపాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి స్ప్రే చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖానికి చల్లదనంతో పాటు తాజాగాను కాంతివంతంగా మెరిసిపోతుంది.
షుగర్ స్క్రబ్ : పుచ్చకాయలో యాంటి ఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు విటమిన్ సీ కూడా అధికంగా లభిస్తుంది. ఇవి చర్మాన్ని మృదువుగా చేయడంలో తోడ్పడతాయి. పుచ్చకాయ రసానికి కొద్దిగా చక్కెర, కొబ్బరినూనె కలిపి ఒంటికి రాసుకొని రుద్దుకోవాలి. ఇలా చేస్తే ఇరవై నిమిషాల పాటు ఈ రసంతో రుద్దుకుని అనంతరం కడిగేసుకుంటే సరి. మన చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.
ఫేస్ మాస్క్ : పుచ్చకాయకు సూర్యూడి నుంచి వచ్చే యూవీ కిరణాల వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడే శక్తి ఉందని జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్ అధ్యయనం తెలిపింది. దీనికి వాపునీ తగ్గించే శక్తి ఉందట. ఇందులో ఉండే లేకోపీన్ ముఖాన్ని కాంతివంతంగా చేసేలా తోడ్పడుతుంది. ఇలా మనం కూడా పొందాలంటే దీనికోసం పుచ్చకాయ ముక్కని నలిపి దానిలో కొద్దిగా పెరుగు, కొంచెం తేనె కలిపి ముఖానికి మాస్క్‌లా పెట్టుకుంటే పై ఫలితాన్ని పొందవచ్చు. మీరు కూడా ట్రై చేయండి మరి.
తలకు పూత : ముఖ రక్షణే కాదు.. కేశ సంరక్షణ కూడా ఎంతో ముఖ్యమైనది. ఈ వేజి ముఖాన్నే కాదు.. జుట్టూను నిర్జీవంగా చేస్తోంది. జుట్టూ నిర్జీవంగా మారి చిట్లుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే పుచ్చకాయ రసానికి కాస్త కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే సరిపోతుంది. ఈ ప్యాక్‌ను అరగంట పాటు ఉంచి తర్వాత తలస్నానం చేస్తే కేశాలకు కావాల్సిన పోషణ అంది నిగనిగలాడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ట్రై చేయండి.
ఇవీ చదవండి: