ETV Bharat / state

నిర్మించిన కొద్ది రోజులకే... కూలిన మూడంతస్థుల భవనం - HOUSE_COLLAPSE_CDP

ఏపీ కడప జిల్లా రైల్వే కోడూరులో నూతనంగా నిర్మించబడ్డ నాలుగు అంతస్తుల అందమైన భవనం పక్కకు ఒరిగింది. అందులో నివసిస్తున్న వారంతా ఆందోళన చెంది వెళ్లిపోయారు. చేసేది లేఖ ఆ ఇంటిని యజమాని కూల్చేశారు.

కూలిన మూడంతస్థుల భవనం
author img

By

Published : Oct 17, 2019, 5:13 AM IST

కూలిన మూడంతస్థుల భవనం

ఆంధ్రప్రదేశ్​ కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ఎదురుగా, కే బుడుగుంటపల్లికి చెందిన తిరుపతి శేఖర్ అనే వ్యక్తి ఇటీవలే నాలుగు అంతస్తుల భవనం కట్టాడు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఆ భవనం టైల్స్ వ్యాపారానికి అద్దెకు ఇచ్చారు. భవనం పక్కనే వేరొక భవనాన్ని నిర్మించేందుకు గుంతలు తవ్వడం ప్రారంభించారు. ఈ పని సాగుతుండగానే భవనం పక్కకు ఒరిగింది. పిల్లర్ల వద్ద నెర్రెలు రావడం వల్ల ఫ్లోరింగ్ దెబ్బతింది. ఈ పరిణామంతో అద్దెకు ఉండే వ్యక్తి భయంతో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఆందోళన పడ్డ ఇంటి యజమానులు... ఇంజినీర్ల సలహా మేరకు జెసీబీతో ఇంటిని కూల్చి వేశారు. అందంగా కట్టుకున్న భవనం కూల్చివేస్తున్నందుకు ఇంటి యజమానులు చాలా బాధ పడ్డారు. ఇల్లు కట్టుకుని రెండు మూడు నెలలు కాకముందే కూల్చివేయడం కలిచివేసిందన్నారు. ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.