ప్రజల భాగస్వామ్యంతోనే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. సీసీ కెమెరాలో ఏర్పాటులో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు 16వ స్థానం దక్కిందంటే.. అది నగరవాసుల సహకారంతోనే సాధ్యమైందన్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన 16 మందిని అంజనీకుమార్ సత్కరించారు. జన సమర్ధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండటం వల్ల ఎంతో భద్రత ఉంటుందన్నారు. అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగినా దర్యాప్తు సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని అంజనీకుమార్ వివరించారు. న్యూయార్క్‌తో పోలిస్తే హైదరాబాద్‌లోనే హత్యల శాతం తక్కువగా ఉందన్నారు. పౌరులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటును మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..