రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు హోంమంత్రి మహమూద్‌అలీ. అన్ని అధునాతన సదుపాయాలు కలిగిన ఠాణా అని పేర్కొన్నారు. అనంతరం సరూర్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన ఎల్బీనగర్ సీసీఎస్, ఐటీ సెల్, ఎస్ఓటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంబర్‌పేట్‌లోని మోటార్ ట్రాన్స్‌పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన రాష్ట్రంలో నేర శాతం తగ్గిందన్నారు.
పోలీసులకు సీఎం పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. కాగజ్ నగర్ ఘటనలో అటవీ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. అటవీ అధికారులు, అన్యాక్రాంతమైన అడవులను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లినా, హరితహారంలో మొక్కలు నాటేందుకు వెళ్లినా పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : దాడిపై ఎవరేం చెప్పాలో ఎమ్మెల్యే కోనప్ప హుకుం