ETV Bharat / state

హిమాలయ సంస్థ మూసివేస్తారనే వార్తలు అవాస్తవం...

హిమాలయ సంస్థను మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవని ఆ సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. యథావిథిగా తమ సేవలను ప్రజలకు అందించనున్నట్లు తెలిపింది. హిమాలయ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న జివాంక కంపెనీ ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేస్తూ... ఓ లేఖను విడుదల చేసింది. ఉద్యోగులు ఎలాంటి భయం లేకుండా విధులకు హాజరుకావాలని పేర్కొంది.

HIMALAYA COMPANY RELEASE DRAFT STATEMENT FOR MEDIA
author img

By

Published : Oct 17, 2019, 10:48 PM IST

హిమాలయ కంపెనీని మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తల పట్ల ఆ సంస్థ యాజమాన్యం స్పందించింది. సంస్థను మూసేసే ఆలోచన లేదని... యథావిథిగా తమ సేవలను ప్రజలకు అందించనున్నట్లు స్పష్టం చేసింది. హిమాలయ సంస్థలో ఔట్​సోర్సింగ్​ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న జివాంక కంపెనీ ఉద్యోగులు ఈ వార్తల పట్ల వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేస్తూ... మీడియాకు ఓ లేఖ విడుదల చేసింది. ఉద్యోగులంతా తమ విధులకు ఎప్పటిలాగే హాజరుకావాలని సూచించింది.

హైదరాబాద్​లో ఒక నెల నుంచి ఉద్యోగులెవ్వరూ తమ విధులకు సరిగ్గా హాజరుకావటం లేదని యాజమాన్యం పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉద్యోగులతో సమావేశం నిర్వహించినప్పటికీ... ఎవ్వరూ హాజరుకాలేదని తెలిపింది.

హిమాలయ కంపెనీ ఎప్పుడూ ఉద్యోగులకు ప్రోత్సాహకంగానే ఉంటుందని యాజమాన్యం గుర్తుచేసింది. తమలోని సృజనాత్మక ఆలోచనలు, సలహాలు, సూచనలకు విలువనిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడుతామని తెలిపింది. 2018లో మొదలైన జివాంక సంస్థ... అనేది హిమాలయ కంపెనీలో ఓ భాగమని చెప్పింది. అందులోని ఉద్యోగులకు మొదటి నుంచి అన్నింటా... పూర్తి సహకారం అందిస్తున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో ఎన్ని అవకాశాలిచ్చినా... జివాంక ఉద్యోగులు మాత్రం తమకు వారి పనితనాన్ని సంస్థకు చూపించట్లేదని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది.

ఒక బాధ్యత గల సంస్థగా... సమస్యలు, అసౌకర్యాలను తమ దృష్టికి తీసుకొస్తే తమ పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించి విధుల్లో విధిగా హాజరు అవుతారని యాజమాన్యం ఆకాంక్షించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.