ETV Bharat / state

స్వైన్ ఫ్లూ, డెంగ్యూ నివారణకు చర్యలేవి..? - హైకోర్టు ప్రశ్నించింది

వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా  స్వైన్ ప్లూ, డెంగ్యూ వ్యాధుల నియంత్రణకు ఎటువంటి ఏర్పాట్లు చేశారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆగస్టు 2లోగా నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

స్వైన్ ప్లూ, డెంగ్యూ నివారణకు చర్యలేవి
author img

By

Published : Jul 14, 2019, 5:01 AM IST

Updated : Jul 14, 2019, 7:01 AM IST

స్వైన్ ప్లూ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం తక్షణ ఏర్పాట్లు ఏంచేస్తుందో చెప్పాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాధుల నివారణకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మారగాదర్శకాల అమలు తీరుపై ఆగస్టు 2లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ప్లూ, డెంగ్యూకు సంబంధించి సరైన వైద్య చికిత్స అందడం లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేవని న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్​లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది

ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి ఓ నివేదికను హైకోర్టుకు సమర్పించారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులను గుర్తించడానికి రాష్ట్రం మొత్తానికి కేవలం రెండు కేంద్రాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. స్వైన్ ప్లూను గుర్తించే స్థితిలో వైద్యులు లేరన్నారు. దీనివల్ల ప్రజలు మృత్యువాత పడుతున్నారని తెలిపారు. పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాలు సూక్ష్మవ్యూహ ప్రణాళిక ద్వారా రెండేళ్లలో మలేరియా రాకుండా చూశాయని.. అలాంటి విధానాలు ఇక్కడ అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం వర్షాకాలం ప్రారంభంలో కాస్త జాప్యం జరిగిందని... ఇది ప్రారంభం కాకముందే స్వైన్ ప్లూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టులకు నివేదికతో సరిపెట్టకుండా కార్యచరణ చేపట్టాలని సూచించింది.

ఇదీ చూడండి : లోక్​అదాలత్​లో 11వేల కేసుల పరిష్కారం

Intro:Body:Conclusion:
Last Updated : Jul 14, 2019, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.