గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రజా ప్రతినిధుల కోర్టు విధించిన ఏడాది జైలు శిక్షపై.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి విచారణను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2016లో ఓయూలో బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా ఎమ్మెల్యే.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కేసులో ఇటీవల ప్రజా ప్రతినిధుల కోర్టు... ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాజాసింగ్ హైకోర్టును ఆశ్రయించారు.
ఎమ్మెల్యే దాఖలు చేసిన అప్పీల్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో నేడు విచారణ జరిగింది. ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పును నిలిపివేస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: మేం తల్చుకుంటే మీరు మిగలరు: కేసీఆర్