ETV Bharat / state

G.O. 402: జీవో 402 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - High Court latest news

Telangana High Court on G.O. 402: ఉపాధ్యాయుల అంతర్​ జిల్లాల పరస్పర బదిలీలకు సంబంధించిన సవరణ జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. జీవో 21ని సవరిస్తూ ఫిబ్రవరి 19న జారీ చేసిన జీవో 402 అమలును నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

G.O. 402: జీవో 402పై హైకోర్టు స్టే
G.O. 402: జీవో 402పై హైకోర్టు స్టే
author img

By

Published : Apr 12, 2022, 4:49 AM IST

Telangana High Court on G.O. 402: ఉపాధ్యాయుల అంతర్​ జిల్లాల పరస్పర బదిలీలకు సంబంధించిన సవరణ జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. జీవో 21ని సవరిస్తూ ఫిబ్రవరి 19న జారీ చేసిన జీవో 402 అమలును నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సవరణ జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ విజయసేన్​రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు.

జీవో 21 ప్రకారం అంతర్ జిల్లాల పరస్పర బదిలీలు కోరుకున్నట్లయితే సర్వీసు మొదటి నుంచి ప్రారంభం అవుతుందన్నారు. కానీ జీవో 402 ప్రకారం పాత ఉమ్మడి జిల్లా పరిధిలో పరస్పర బదిలీ ఉన్నట్లయితే సర్వీసు లెక్కింపు ఉంటుందన్నారు. ఇప్పటికే కొత్త జిల్లాలకు కేటాయింపులు పూర్తయినందున.. ఏ బదిలీ జరిగినా అది అంతర్ జిల్లాగానే పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ల న్యాయవాదులు వాదించారు. వాదనలు విన్న హైకోర్టు పిటిషన్లపై విచారణను వాయిదా వేస్తూ.. సవరణ జీవోపై స్టే ఇచ్చింది.

గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు..

ఉపాధ్యాయుల అంతర్‌ జిల్లాల పరస్పర బదిలీలకు చెందిన జీవో 21కు సవరణ తీసుకువస్తూ జారీ చేసిన జీవో 402 అమలుపై యథాతథస్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 19న జారీ చేసిన జీవో 402ను సవాలు చేస్తూ కె.తిరుపతిరెడ్డితో పాటు మరో 9 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఈ మేరకు తీర్పు వెల్లడించారు.

పిటిషనర్ల తరఫున ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ..ఇప్పటికే జీవో 317 ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయింపులు పూర్తయినందున, ఏ బదిలీ జరిగినా అది అంతర్‌ జిల్లానే అవుతుందన్నారు. అందువల్ల జీవో 402 చట్టవిరుద్ధమని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఈ పిటిషన్‌లపై విచారణను వాయిదా వేశారు.

ఇవీ చూడండి:

అప్పటివరకు జీవో 402 అమలుపై యథాతథ స్థితి

ప్రపంచానికి అలాంటి భర్త కావాలి: అనసూయ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.