కరోనా కిట్లు, ఆర్థిక సాయం, బీమా సదుపాయం కోసం ప్రభుత్వాన్ని కోరాలని జర్నలిస్టులకు హైకోర్టు సూచించింది. జర్నలిస్టుల వినతిపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనాపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న జర్నలిస్టులకు ప్రభుత్వం కిట్లు, ఆర్థిక సాయం, బీమా సదుపాయం కల్పించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్ లేఖ రాశారు.
స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్ చౌహన్, జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. కరోనాపై ప్రజల్లో చైతన్యం కలిగించడంలో జర్నలిస్టుల పాత్ర మరవ లేనిదని హైకోర్టు వ్యాఖ్యానించింది. జర్నలిస్టుల వినతిని ప్రభుత్వం కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇవీ చూడండి: నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష