High Court Orders to Allow Shia Women to Enter Synagogues : మసీదు, జాషన్స్, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలను ప్రార్థనల నిమిత్తం అనుమతించకపోవడాన్ని హైకోర్టు(Highcourt) తప్పుపట్టింది. మహిళల పట్ల వివక్ష తగదని, రాజ్యాంగం(Indian Constitution) కల్పించిన హక్కులను కాలరాయవద్దని వ్యాఖ్యానించింది. ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మసీదు, జాషన్స్ తదితర పవిత్ర ప్రాంతాల్లో ప్రార్థనలకు షియా ముస్లిం మహిళలను అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ అంజుమన్ ఎ అలవి, షియా ఇమామియా ఇత్నా అషారి అక్బరీ సొసైటీ కార్యదర్శి ఆస్మా ఫాతిమా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది(Senior Advocate) వాదనలు వినిపిస్తూ ఇబ్దత్ ఖానాకు చెందిన ముత్తవలీల కమిటీ కేవలం షియా తెగకు చెందిన మహిళలను అనుమతించడం లేదన్నారు.
ప్రార్థనల నిమిత్తం ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలని వక్ఫ్ బోర్డుకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. వక్ఫ్ బోర్డు(WAQF Board) తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఖురాన్ ప్రకారమే ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి ఉంటుందని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక, మహిళల పట్ల వివక్ష ప్రదర్శించడం తగదని, రాజ్యాంగం హక్కులను హరించడానికి వీల్లేదన్నారు.
High Court Interim Order Issued to Mutawalli Committee : ఖురాన్, బైబిల్, తోహా, భగవద్గీత, ఒక యోగి ఆత్మకథ తదితర గ్రంథాల్లోని అంశాలతో పాటు వివేకానంద(Swamy Vivekananda) మహిళల గురించి పేర్కొన్న పలు అంశాలను ఈ సందర్భంగా న్యాయమూర్తి చదివి వినిపించారు. షియా మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలంటూ ముత్తవలీ కమిటీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
దిల్లీలో 'కేరళ స్టోరీ'.. ప్రేమగా దగ్గరై రేప్.. మతం మార్చి వివాహం.. 11 ఏళ్ల తర్వాత..
నిర్దిష్టమైన రోజులు తప్ప మహిళలు నిరభ్యంతరంగా ప్రార్థన చేసుకోవచ్చని, భగవంతుడికి తారతమ్య భేదాలు ఉండవన్న విషయం పవిత్ర గ్రంథాల ద్వారా అర్థమవుతుందన్నారు. అలాగే మహిళల నిషేధానికి సంబంధించి అభ్యంతరాలేమిటో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని వక్ఫ్ బోర్డును ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
దీపావళి రోజున వృద్ధులతో ముస్లిం ఆధ్యాత్మిక టూర్- మతాలకు అతీతంగా!!
Muslim Build Temple : అమ్మవారి గుడి నిర్మించిన దివ్యాంగ ముస్లిం.. రోజూ ప్రత్యేక పూజలు