ETV Bharat / state

'ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల గురించే మా ఆందోళన ' - high court hearing on online classes

'ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల గురించే మా ఆందోళన '

author img

By

Published : Aug 27, 2020, 2:06 PM IST

Updated : Aug 27, 2020, 2:34 PM IST

14:01 August 27

'ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల గురించే మా ఆందోళన '

ఆన్‌లైన్‌ తరగతులు, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆన్‌లైన్‌ తరగతులపై విధివిధానాలు ఖరారు చేసినట్లు ధర్మాసనానికి వివరించిన ప్రభుత్వం... టీశాట్, దూరదర్శన్ ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది. టీవీ పాఠాల్లో విద్యార్థులకు అనుమానాలు వస్తే ఎలా నివృత్తి చేసుకుంటారని హైకోర్టు ప్రశ్నించగా... ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని ప్రభుత్వం బదులిచ్చింది. 

కుటుంబంలో ముగ్గురు విద్యార్థులు ఉంటే ఒకేసారి టీవీ పాఠాలు ఎలా వింటారని హైకోర్టు ఆరా తీయగా... 1 నుంచి 10వ తరగతి వరకు వేర్వేరు సమయాల్లో పాఠాలు ప్రసారమవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు తీసుకోవట్లేదని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వేర్వేరు సమస్యలున్నాయన్న హైకోర్టు... ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల గురించే తమ ఆందోళన అని వెల్లడించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 18కి హైకోర్టు వాయిదా వేసింది. 

ఇదీ చూడండి: 'ఈటీవీ'కి మహేశ్​ రజతోత్సవ శుభాకాంక్షలు

Last Updated : Aug 27, 2020, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.