కరోనా వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో... చికిత్స అందించడానికి గాను ప్రభుత్వ, ప్రైవేటు బోధనాస్పత్రులను వినియోగించుకోకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మిలిటరీ ఆస్పత్రులతోపాటు, ప్రభుత్వ, ప్రైవేటు బోధనాస్పత్రుల్లోని మౌలిక సదుపాయాలను వినియోగించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ డాక్టర్ ఆర్ . శ్రీవాత్సన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... మిలటరీ ఆస్పత్రితోపాటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల భవనాలను, ప్రైవేటు బోధనాస్పత్రులను... వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వాదనలను విన్న ధర్మాసనం కరోనా ఎడాపెడా పెరుగుతున్న విషయం... ప్రభుత్వానికి తెలుసని, బోధనాస్పత్రుల సేవలను వినియోగించుకోవడంపై.... విధానమేమిటో చెప్పాలంది. ఇందులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రైల్వే ఆస్పత్రి, డెక్కన్ కాలేజ్, సాధన్, ఆయాన్ ఇన్‌స్టిట్యూట్... కామినేని, భాస్కర్ మెడికల్ కాలేజీ, అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్... మిలటరీ ఆస్పత్రి, తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 13కి హైకోర్ట్ వాయిదా వేసింది.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1278 కేసులు.. మరో 8 మంది మృతి