హైదరాబాద్ గాజులరామారంలోని మహారాజా గార్డెన్స్ వాక్సినేషన్ కేంద్రంలో రద్దీ నెలకొంది. టీకా కోసం జనం ఎగబడ్డారు. గేటు వద్ద ఉన్న పోలీసులు వారిని నిలువరించలేకపోవడంతో లోపలికి వచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సగం మందిని తిరిగి పంపించారు.
ఉదయం నుంచి క్యూ లైన్లలో ఎదురుచూస్తున్న తమని పంపించడం దారుణమని టీకా కోసం వచ్చిన జనం వాపోయారు. సుమారు 1500 మందికి పైగా తరలివచ్చారు.
ఇదీ చదవండి: Inter exams: ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు