హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్, అల్వార్ బొల్లారం, బేగంపేట, మరెడపల్లి, చిలకల గూడ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వాన కురిసింది. మల్కాజిగిరి, కాప్రా, నేరెడ్మెట్, కుషాయిగూడ, చర్లపల్లిలో వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. వాహన దారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. కొన్ని చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. పలు కాలనీల్లో చీకట్లు అలుముకున్నాయి. తార్నాక, ఓయూ క్యాంపస్‌లో వరద నీరు రోడ్లపై చేరింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలు వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.
మేడ్చల్ జిల్లా ఘటకేసర్లో పెట్రేల్ బంకు వద్ద తాటి చెట్టుపై పిడుగు పడింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగపోవడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి : ట్విట్టర్లో ఎన్నికల హవా.. మోదీనే టాప్