వేసవి తాపంతో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న నగరవాసులను వరుణుడు కరుణించాడు. సికింద్రాబాద్లోని బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి, మారేడ్పల్లి తదితర ప్రాంతాల్లో సుమారు అరగంట సేపు భారీ వర్షం కురిసింది. ఫలితంగా నగరంలో వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో నగరవాసులు పులకరించిపోయారు.
ఉదయం నుంచే ఆకాశంలో మబ్బులు కమ్ముకుని ఉండగా.. మధ్యాహ్నం వేళ ఉరుములతో కూడిన వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.
ఇదీ చదవండి: 8 వేలు దాటిన కరోనా మరణాలు.. 2లక్షలకు పైగా కేసులు