రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచే భగ్గుమంటున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో అత్యధికంగా 45.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లాలోని చప్రాలలో 45.6 డిగ్రీలు, భోరాజ్లో 45.3 డిగ్రీలు, జగిత్యాల జిల్లాలోని ఐలాపూర్లో 45.1, గోవిందారంలో 45 డిగ్రీలు, నిర్మల్ జిల్లా బాసరలో 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
'ఏపీ అభ్యంతరాలను జీఆర్‌ఎంబీ ఛైర్మన్ తిరస్కరించారు'
చిరు లీక్స్.. 'భవదీయుడు' సినిమాలోని డైలాగ్ చెప్పేసిన మెగాస్టార్