ETV Bharat / state

Telangana Harithosthavam Today : నేడు 'తెలంగాణ హరితోత్సవం'.. మొక్కలు నాటనున్న సీఎం - తెలంగాణకు హరితోత్సవం

Telangana Harithosthavam in Decade Celebrations : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ హరితోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో తొమ్మిదో విడత హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తుమ్మలూరు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారంలో పాల్గొననున్నారు.

Telangana Harithosthavam Today
Telangana Harithosthavam Today
author img

By

Published : Jun 19, 2023, 6:51 AM IST

Telangana Decade Celebrations 2023 : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెలంగాణ హరితోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో తొమ్మిదో విడత హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు. ఈ విడతలో 19.29 కోట్ల మొక్కలను నాటలని లక్ష్యాన్ని నిర్దేశించారు. అన్ని సాగునీటి ప్రాజెక్టుల స్థలాలు, కాలువల వెంట పచ్చదనం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. హరితోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తుమ్మలూరు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో మొక్కలు నాటనున్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

Haritha Haram Programme in Telangana : రాష్ట్ర అభివృద్ది, సంక్షేమమే కాకుండా.. భవిష్యత్తు తరాలకు భూగోళాన్ని పరిరక్షించడం, పర్యావరణ పరంగా సుస్థిర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి రూపకల్పన చేశారని అధికారులు తెలిపారు. పెరుగుతున్న జనాభాతో అవసరాలు పెరిగి.. అడవులు కనుమరుగవుతున్నాయన్నారు. దానితో వాతావరణంలో మార్పులు వచ్చి వర్షపాతం తగ్గిపోతుందని.. 2015లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వివరించారు.

Harithosthavam Programme in Telangana Today : తెలంగాణలో అటవీ విస్తీర్ణం 24 శాతం నుంచి 33 శాతానికి పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 2015-16లో 'తెలంగాణకు హరితహారం' కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. కేవలం ప్రభుత్వ పరంగానే కాకుండా.. ప్రజలను, రైతులను భాగస్వాములను చేసి ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు నడుపుతోంది. హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. చైనా, బ్రెజిల్ తర్వాత పచ్చదనాన్ని పెంచడంలో అతిపెద్ద మానవ ప్రయత్నంగా ఖ్యాతికెక్కింది. ఈ కార్యక్రమం చేపట్టడంతో పర్యావరణ సమతుల్యం కాపాడుకోవడంతో పాటు జీవనోపాధి కల్పన, మంచి వర్షపాతం నమోదవుతుంది.

ప్రత్యేక శ్రద్ధతో..: ప్రతి గ్రామంలో చెట్ల పెంపకాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి, మొక్కలను నాటి వాటిని రక్షించి, గ్రామంలో పచ్చదనాన్ని పెంచి, పరిశుభ్రతను కాపాడాలని ఆ చట్టంలో పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు హరిత రక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. పచ్చదనం పెంపొందించడంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, సంస్థాగత ప్లాంటేషన్, హోం స్టెడ్ ప్లాంటేషన్, ఆగ్రో ఫారెస్ట్రీ ప్లాంటేషన్ పేరిట మొక్కలు పెద్ద సంఖ్యలో నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇటీవల సవరించిన పంచాయతీరాజ్ చట్టం 2018, మున్సిపల్ చట్టం 2019లో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో 10 శాతం గ్రీన్ బడ్జెట్‌గా కేటాయించి, పచ్చదనాన్ని విస్తరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

పెరిగిన పచ్చదనం..: పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 273 కోట్ల మొక్కలను ప్రభుత్వం పెంచింది. 2015-16లో తెలంగాణలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా.. 2023 నాటికి అది 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని అధికారులు తెలిపారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 7.70 శాతం పచ్చదనం పెరిగిందని పేర్కొన్నారు. గతంలో పట్టణాలు, నగరాల్లో పచ్చదనం కరవై, ఉద్యానవనాలు లేక ప్రజలు ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక నర్సరీతో పాటు, 19,472 పల్లె ప్రకృతి వనాలు, 2,275 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. రహదారులకు ఇరువైపులా మొక్కలను పెద్ద సంఖ్యలో పెంచింది.

దిగ్విజయంగా ముందుకు..: పట్టణాలో రూ.700 కోట్ల వ్యయంతో 179 చోట్ల అర్బన్ ఫారెస్ట్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో హరిత నిధిని ఏర్పాటు చేసింది. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ హరిత నిధిలో భాగస్వాములు అయ్యారు. వీరందరి నుంచి సేకరించిన మొత్తంతో హరిత నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హరిత నిధికి నోడల్ ఏజెన్సీగా అటవీ శాఖ వ్యవహరిస్తుంది. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల సహకారం తోడవడంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. సుమారు ఒక లక్ష కిలోమీటర్ల మేర రాష్ట్రవ్యాప్తంగా రహదారి వనాలను ఏర్పాటు చేశారు. 13.44 లక్షల ఎకరాల క్షీణించిన అడవులను పునరుద్ధరణ చేశారు.

ఇవీ చూడండి..

Haritha nidhi: హరిత నిధికి ఎవరెవరు ఎంత విరాళాలు ఇవ్వాలంటే..

indrakaran reddy: 'అటవీ విస్తీర్ణాన్ని 33 శాతం పెంచడమే లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.