ETV Bharat / state

ఉస్మానియాలో అడుగడుగునా హరితహారం: సీఎస్ - ఓయూలో హరితహారం

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా హెచ్ఎండీఏ ఉస్మానియా యూనివర్సిటీలో యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటే కార్యక్రమాన్నికి శ్రీకారం చుట్టింది. ఐదు లక్షల మొక్కలు పెంచనున్నట్లు సీఎస్​ సోమేశ్​ కుమార్ తెలిపారు.

Harithaharam Programme in Osmania University
ఉద్యమాల గడ్డ... పచ్చదనానికి అడ్డా
author img

By

Published : Jul 14, 2020, 10:52 PM IST

హైదాబాద్​ ఉస్మానియా యూనివర్సిటీలో హెచ్​ఎండీఏ ఆధ్వర్యంలో ఐదు లక్షల మొక్కల పెంపకాన్ని చేపడుతున్నట్లు సీఎస్​ సోమేశ్​ కుమార్​ తెలిపారు. విశ్వవిద్యాలయంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఇప్పటికే ఉన్న చెట్లకు మధ్య మొక్కలు నాటనున్నట్లు వెల్లడించారు. విశ్వవిద్యాలయం భూములు అన్యాక్రాంతం కాకుండా ఖాళీ స్థలాలు ఉన్న చోటల్లా పచ్చదనం కనిపించేలా విస్తృత స్థాయిలో మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం సంతరించేందుకు వీలుగా, కుందేళ్లు, నెమళ్లు ఇతర అటవీ పక్షులు అలారారే విధంగా పూలు, పండ్ల మొక్కల పెంపకానికి హెచ్‌ఎండీఏ ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా మర్రి, ఉసిరి, సీతాఫలం, దానిమ్మ, అల్లనేరేడు, కానుగ, వేప వంటి మొక్కలను నాటారు. వాటితోపాటు ఎవెన్యూ ప్లాంటేషన్​లో కంటికి ఇంపుగా కనిపించే పూల మొక్కలు పూల మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉస్మానియా వర్సిటీ ఇంఛార్జి వైస్​ ఛాన్సలర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ​ అరవింద్​ కుమార్ పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.