హనుమంతుడు తిరుమలగిరులలోని అంజనాద్రిలో జన్మించాడని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ధారించింది. ఈ నెల 13న ఉగాది సందర్భంగా.. ఈ విషయాన్ని అధికారికంగా తితిదే ప్రకటించనుంది. పురాణ, శాస్త్రీయ ఆధారాలతో వెల్లడించాలని సిబ్బందిని తితిదే ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు.
హనుమంతుడి జన్మస్థానం ఆధారాల సేకరణకు డిసెంబరులో కమిటీ ఏర్పాటు అయింది. పలుసార్లు కమిటీ సభ్యులు సమావేశమై చర్చించారు. ఐదు పురాణాలు, పలు గ్రంథాలు కమిటీ పరిశీలించింది. హనుమంతుడి జన్మస్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇతర వివరాలతో త్వరలో తితిదే సమగ్రమైన పుస్తకాన్ని ముద్రించనుంది.
ఇదీ చదవండి: సామూహిక పంచాంగ శ్రవణం వద్దు.. నిరాడంబరంగానే ఉగాది వేడుకలు